నల్లగొండ జనరల్ హాస్పిటల్ నుండి మూడేళ్ల బాలుడు కిడ్నాప్

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 4వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ కి వచ్చి మూడు సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

బాధితుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే టూ టౌన్ ఎస్ఐ 8712670176,స్టేషన్ 8712531328 మెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Three-year-old Boy Kidnapped From Nalgonda General Hospital, Three-year-old Boy,

Latest Nalgonda News