నల్గొండ జిల్లా:నాంపల్లి మండలంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
పూల శివ,దేవి దంపతులు మర్రిగూడెం మండలం బట్లపల్లి గ్రామంలో తోట కౌలుకు తీసుకున్నారు.పని పూర్తి చేసికొని బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా లింగోటం వడ్డేపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి మోటు రాళ్లకు ఢీ కొట్టింది.
శివ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







