కాంగ్రెస్ టిక్కెట్ల కోసం పోటీలు పడుతున్నారా ..? నిజమేనా...?

ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఎవరిని అడిగినా చెప్తారు.పేరుకు జాతీయ పార్టీ అయినా … ప్రస్తుతానికి ఏపీలో మాత్రం జీరో గానే ఆ పార్టీ ఉంది.

 Andhra Pradesh Leaders Demands Congress Party Tickets-TeluguStop.com

తెలంగాణ – ఆంధ్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ… గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంది.ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో పోటీ చేసినా.

ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు.అంతెందుకు ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా గెలుచుకునే సత్తా ఉన్నట్టు కనిపించడం లేదు.

ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూనే ఎన్నికల్లో పోటీకి సై అంటోంది.ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్న వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు ప్రకటించడమే.ఈ మేరకు అభ్యర్థుల నుంచి భారీగా అప్లికేషన్ లు వాచాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

25 పార్లమెంట్ సీట్లలో 190 దరఖాస్తులు… అలాగే 175 అసెంబ్లీ సీట్లు లో 1060 దరఖాస్తులు వచ్చాయని ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది.అయితే ఇక్కడే అందరికీ డౌట్ వచ్చేస్తుంది.కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి లేదు.అయితే… పార్టీలో కొద్దో గొప్పో నాయకులు ఉన్నా… వారంతా పక్క పార్టీల్లో కి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.టిడిపి, వైసిపి, జనసేన పార్టీల్లో ఇప్పటికే కొంతమంది చేరిపోయారు.కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్ల వరకు ఏపీలో పుంజుకునే పరిస్థితి లేదని ముందే గ్రహించిన నాయకులంతా ఇలా ముందే తమకు అనువైన పార్టీలను ఎంపిక చేసేసుకుని సీటు కూడా రిజర్వడ్ చేసేసుకున్నారు.

ఏపీలో తమకు ఏ మాత్రం బలం తగ్గలేదని… చెప్పుకోవడానికే ….కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన ఎత్తుగడలు వేస్తూ…తమకు బలం ఉందని చెప్పుకోవడానికి ఈ టికెట్ల దరఖాస్తుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది.అయితే ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నవారిలో … అనేక మంది కొత్తవారే… కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవం లేని వారు కూడా.కాంగ్రెస్ టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నట్టుగా సమాచారం.

అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇంత డిమాండ్ అని, ఇదంతా కేవలం ఏపీ కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో తెరమీదకు తెచ్చిన ఓ సరికొత్త ఎత్తుగడ అని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube