Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

గాట్లు మరియు గీతలను తగ్గించుకోవటానికి సులభమైన ఇంటి నివారణలు-Natural Home Remedies For Bites And Lines

పెద్ద పెద్ద గాయాలు అయితే వెంటనే వైద్యం అందవలసిన అవసరం ఉంది. కానీ చిన్న చిన్న గీతలను సులభంగా సహజమైన ఇంటి నివారణలతో నయం చేసుకోవచ్చు. మచ్చలు మరియు అంటువ్యాధుల అభివృద్ధి ప్రమాదం తగ్గించేందుకు గీతలను మరియు కోతలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాల్సిన అవసరం ఉంది. మనకు వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్ధాలు గాట్లను నయం చేయటంలో సహాయపడతాయి. ఒకవేళ ఇంటి నివారణలతో నయం కాకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

1. వెల్లుల్లి


వెల్లుల్లి గీతలు, పుళ్ళు మరియు కోతలను నయం చేయటంలో పురాతన కాలం నుండి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన మైక్రోబియల్ ఏజెంట్ ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షించటానికి సహాయపడుతుంది. అయితే వెల్లుల్లి కొంత చికాకును కలిగిస్తుంది. ఒక కప్పు వైన్ లో మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా కలిపి రెండు నుండి నాలుగు గంటల తర్వాత వడగట్టాలి. ఈ ద్రవాన్ని రోజులో కొన్ని సార్లు గాయానికి రాస్తే మంచి పలితం కనపడుతుంది. ఒకవేళ చికాకు దీర్ఘకాలం ఉంటే కనుక ఈ నివారణ చేయటం ఆపేయాలి.

Continue Reading
To Top