శ్రీరస్తు శుభమస్తుకు చిరు స్పెషల్ ఎట్రాక్షన్..!

మెగా సపోర్ట్ తో అల్లు హీరోల హవా ఎలా కొనసాగిస్తునారో అల్లు అర్జున్ సినిమాల కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.ఇక అల్లు, మెగా ఫ్యామిలీల అనుబంధం ఈనాటిది కాదు పేరుకు అల్లు ఇంటిపేరైనా సరే అల్లు అర్జున్, శిరీష్ లు కూడా మెగా హీరోలనే అంటుంటారు.

 Chiranjeevi Special Attraction For Srirastu Subhamastu Pre-release Function-TeluguStop.com

ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా అల్లు సినిమా అయినా దానికి మెగా సపోర్ట్ భారీ రేంజ్ లో ఉంటుంది.ప్రస్తుతం అల్లు శిరీష్ తన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అయితే సినిమా ఆడియో వేడుక చేయకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసిన చిత్రయూనిట్.సరైనోడు సినిమా ప్లాన్లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి ప్లాన్ చేశారు.

ఇక సినిమాకు ప్రమోషన్ తో పాటుగా సినిమా హిట్ కళ తెచ్చేందుకు కొత్త ప్రయత్నంగా చేస్తున్న ఈ అల్లు హీరో సినిమా ఫంక్షన్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.మెగా హీరోలుగా కీర్తించబడుతున్న ఏ హీరో సినిమా అయినా సరే తన సపోర్ట్ ఇచ్చేందుకు ముందుండే చిరు అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమా కోసం కదలి రానున్నాడు.

మరి ఈ హంగామా అంతా చూస్తుంటే అల్లు శిరీష్ ఈసారి హిట్ కొట్టేయడం గ్యారెంటీ అనిపిస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube