ప్రపంచయాత్ర చేస్తున్న యూట్యూబర్.. టేస్టీ ఫుడ్‌కు రివ్యూలు

చదువు సరిగ్గా సాగకుంటే వారు ఎందుకు పనికి రారని పెద్దలు తిడుతుంటారు.అయితే ప్రస్తుతం కాలం మారింది.

 Youtuber Will Sonbuchner Best Ever Food Review Show Getting Huge Response Detail-TeluguStop.com

చదువుతో సంబంధం లేకుండా తమలోని నైపుణ్యంతో చాలా మంది తమకిష్టమైన రంగంలో ఫేమస్ అవుతున్నారు.అదే సమయంలో సంపాదన కూడా ఆర్జిస్తున్నారు.

ఇదే కోవలోకి ప్రసిద్ధ యూట్యూబర్ విల్ సన్‌బుచ్నర్( Youtuber Will Sonbuchner ) వస్తారు.అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో బెస్ట్ ఎవర్ ఫుడ్ రివ్యూ షో( Best Ever Food Review Show ) పేరుతో 8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాడు.

విలియం సన్‌బుచ్నర్ 22 ఆగస్టు 1984న యునైటెడ్ స్టేట్స్‌లోని( America ) మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్‌లో జన్మించాడు.అతను మిన్నెసోటాలో పేద కుటుంబంలో పెరిగాడు.

విల్‌కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.అతని సోదరులలో ఒకరు PhD, మరొకరు న్యాయ పట్టా కలిగి ఉన్నారు.

Telugu America Blogger, Review Show, Reviews Tasty, Latest, Review, Youtuber-Tel

విల్ మిన్నెసోటాలోని సౌక్ రాపిడ్స్-రైస్ హై స్కూల్ నుండి తన పాఠశాల విద్యను అభ్యసించాడు.అతని తోబుట్టువులు అధిక అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, విలియమ్‌కు చదువుపై ఆసక్తి లేదు.విల్ హైస్కూల్‌లో వీడియో ప్రొడక్షన్ చేశాడు.ప్రారంభంలో, విల్ 104.7 KCLD రేడియో స్టేషన్‌లో పనిచేశారు.2008లో, 24 ఏళ్ళ వయసులో, అతను ఒక పెద్ద రేడియో స్టేషన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ రిజెక్ట్ అయింది.తర్వాత ఒక చోట సర్వర్ గా పని చేశాడు.ఓ సమయంలో ఓ ఫుడ్ బ్లాగర్ ఇతర దేశాలకు వెళ్లి అక్కడి రుచికరమైన ఫుడ్ గురించి వివరించడం నచ్చింది.

ఈ క్రమంలో విల్ తొలిసారి దక్షిణ కొరియాకు వెళ్లాడు.

Telugu America Blogger, Review Show, Reviews Tasty, Latest, Review, Youtuber-Tel

అక్కడ పార్ట్-టైమ్ ఇంగ్లీష్ ట్యూటరింగ్ ఉద్యోగాన్ని పొందాడు.ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి రావడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు.అక్కడి నుంచి జపాన్, వియత్నాం, ఇండియా ఇలా ఎన్నో దేశాల్లో పర్యటించాడు.

స్థానికంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ రుచి చూస్తాడు.దాని గురించి తన యూట్యూబ్ ఛానళ్లో రివ్యూ ఇస్తాడు.

దీంతో క్రమంగా ఇతడికి సబ్‌స్క్రైబర్లు పెరిగారు.ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.30 దేశాల్లో పర్యటించి, అక్కడ ఉన్న విభిన్న రుచులతో కూడిన ఆహార పదార్థాలకు రివ్యూ అందించాడు.తద్వారా ఆయన ఆర్జన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇప్పటి వరకు 2 మిలియన్ల యూఎస్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తం ఆర్జించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube