తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ప్రత్యేకతను చాటుకుంటూ ఎప్పటికప్పుడు సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు.అటు పొలిటికల్ గా బిజీగా ఉంటూనే ఇటు వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలతో తన ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహం నింపుతూ ఇలాంటి క్రమంలోనే హరిష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సుజిత్ తో ఓజీ ( OG with Sujith )అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.అయితే ఆయన చేసే సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయాలను పక్కన పెడితే ఆయన కోసం ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఎదురు చూడటం అనేది నిజంగా ఆయన గొప్పతనం అనే చెప్పాలి.
ఆయన నుంచి ఒక సినిమా వచ్చిన చాలు అని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు.అయితే రీసెంట్ గా ఆయన సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్ కి డబ్బులు అవసరం ఉంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ని మళ్లీ వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఆ ప్రొడ్యూసర్ ఎవరు అని ఆరా తీస్తే హరిహర వీర మల్లు మూవీ ప్రొడ్యూసర్ అయిన ఎ.ఏం రత్నం( M.A Ratnam ) గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల డబ్బులు అవసరం పడితే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి లో ఉన్నప్పుడు ఆయనకి అవసరం ఉందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ని ఆయనకిచ్చి తర్వాత మళ్ళీ తీసుకుంటానని చెప్పినట్టుగా తెలిసింది అలా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ.