కాంగ్రెస్ లో విలీనంపై షర్మిల ఏమన్నారంటే... ? 

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల( Ys sharmila ) స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు సిద్ధమవుతోంది.ఒంటరిగానే పార్టీని ఎన్నికలకు తీసుకువెళ్లాలని, అధికారంలోకి రావాలనే పట్టుదలతో షర్మిల పార్టీని స్థాపించారు.

 What Does Sharmila Say About The Merger In Congress , Ys Sharmila, Ysrtp , T-TeluguStop.com

పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించి సరికొత్త రికార్డును నెలకొల్పారు.అయినా ఆ పార్టీలోకి ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడం, పార్టీలో ఉన్నవారు అసంతృప్తితో ఉండడం,  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేకపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుని షర్మిల మొదటగా కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నించారు.

కానీ పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది.విలీనం చేయాల్సిందిగా షరతు విధించింది.

తాజాగా రాహుల్ ,( Rahul Gandhi ) సోనియా గాంధీతో షర్మిల ఢిల్లీలో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా విలీనం అనంతరం చోటు చేసుకునే రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు.

ఈ చర్చ అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఆమె విలీనం అంశంపై ఏ క్లారిటీ ఇవ్వలేదు.

Telugu Aiccpcc, Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Politics

 తాను ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసమే చేస్తానని,  తెలంగాణ ప్రజల కోసమే నా తాపత్రయం అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.దీంతో సోనియా,  రాహుల్,  షర్మిల తో ఏ ఏ అంశాలపై చర్చించారు అనేది క్లారిటీ లేదు.అయితే తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాన్ని బట్టి షర్మిల పార్టీ విలీనం అంశంపై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకోనుంది.అయితే ఇప్పటికే మెజార్టీ కాంగ్రెస్ నాయకులు షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఆమెను ఆంధ్ర రాజకీయాలకే పరిమితం చేయాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్( Congress ) హై కమాండ్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది.

కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడం పై  ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఇప్పటికే కొంతమంది రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతుండగా, షర్మిలకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన కొండా రాఘవరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

Telugu Aiccpcc, Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Politics

 పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, 15 అసెంబ్లీ సీట్లు తీసుకోవాలని షర్మిల చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని షర్మిల చూస్తుండగా,  ఆ నియోజక వర్గం పై ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao )ఆశలు పెట్టుకున్నారు.కాంగ్రెస్ లో చేరి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో తుమ్మల ఉన్నారు.ఈనెల ఆరో తేదీన ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.దీంతో షర్మిల పాలేరులో పోటీ చేయాలన్న కోరిక నెరవేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube