మూడేళ్లుగా లెక్కల మాష్టారు లేక ఇబ్బంది పడుతున్నాం...!

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామం( Chinthakuntla )లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈసందర్భంగా పలువురు విద్యార్థులు ( students )మాట్లడుతూ తమ పాఠశాలలో మూడేళ్ళ నుండి లెక్కల మాస్టారు లేరని,గణిత శాస్త్రం బోధించేవారు లేక అనేక ఇబ్బందులు పడుతున్నా మమ్ముల్ని పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

త్రైమాసిక పరీక్షలు వచ్చే తరుణంలో కూడా మ్యాథ్స్ టీచర్( Maths teacher ) లేకపోతే పదవ తరగతి విద్యార్ధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎన్నిసార్లు ఉన్నతాధికారులు చెప్పినా పట్టించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో స్కూల్ ముందు ధర్నాకు దిగామని చెప్పారు.

We Have Been In Trouble For Three Years Because Of The Master Of Calculations...

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమకు లెక్కల మాష్టారును కేటాయించి,తమకు న్యాయం చేయాలని కోరారు.ఈ ధర్నాకు విద్యార్ధుల పేరెంట్స్ కూడా మద్దతు తెలిపారు.

Advertisement

Latest Nalgonda News