తెలంగాణలో నేడు, రేపు ఓటరు కార్డుల పంపిణీ షురూ...!

నల్లగొండ జిల్లా: నవంబర్‌ 26 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అందించిన ఓటరు గుర్తింపు కార్డులను నేడు,రేపు పంపిణీ చేస్తున్నట్టు పోస్టల్‌ శాఖ ఏడీ ఎన్‌ఎస్‌ఎస్‌ రామకృష్ణ ఒక ప్రకటనలో శనివారం సాయంత్రం తెలిపారు.ఆదివారం 26, సోమవారం 27 సెలవు రోజులైనా 27 న పోస్టు ఆఫీసులు 186 సిబ్బందితో 66,127 ఓటరు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఎన్నికల సంఘం ద్వారా 59.78 లక్షల ఓటరు కార్డులను బుక్‌ చేసుకోగా, 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు 51.41 లక్షల కార్డులను ఓటర్లకు చేరవేసినట్టు చెప్పారు.అడ్రసులు సరిగా లేకపోవడం,కార్డుదారుల ఫోన్‌ నంబర్లు సరిగా లేకపోవడం, ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడం తదితర కారణాలతో 58,903 కార్డులు వెనక్కి పంపినట్టు వివరించారు.

ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్లను డిసెంబర్‌ 3వ తేదీ ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమయ్యే నాటికి చేరవేస్తామని తెలిపారు.

Voter Cards Will Be Distributed In Telangana Today And Tomorrow, Voter Cards , T

Latest Nalgonda News