ఈమధ్య కాలంలో ఎక్కువగా నెటిజన్లను పెంపుడు పిల్లులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా అలరించడం సోషల్ మీడియాలో మనం చూడవచ్చు.ప్రపంచంలోని పెట్ లవర్స్‌ని( Pet lovers ) అనందపరిచే ఈ వీడియోలను చూసి ఆహుతులు టెన్షన్స్ వదిలేస్తున్నారు.
అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మనం చూడవచ్చు.ఆ వీడియోలోని పిల్లి( CAT ) చేసిన విన్యాసాలను సర్కస్‌లో ఉండే కోతులు, ఎనుగులు కూడా చేసి ఉండవని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇక ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఆ వీడియోలో మొదటగా ఆ పిల్లి పుల్ అప్స్ ( Cat pull ups )చేయడం ఇక్కడ చూడవచ్చు.తర్వాత పుచ్చకాయల డంబెల్‌తో కూడా వర్కౌట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.ఆపై బాస్కెట్ బాల్‌ని బాస్కెట్‌లో వేయడం, పుచ్చకాయను తలపై పెట్టి తిప్పడం, పుచ్చకాయను( Watermelon ) ఒక్క దెబ్బతోనే బద్దలు చేయడం వంటి విన్యాసాలను చేయడం ఇపుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అంతేకాకుండా ఇక్కడ అది ఇటుక రాయిని చిన్న దెబ్బతో 2 ముక్కలు చేయడాన్ని పలువురు నెటిజన్లు దాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.కాగా ఇది వీడియోకే హైలెట్ అని చెప్పుకోవాలి.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోయి మరీ కామెంట్ చేస్తున్నారు.అసలు ఇది ఎలా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.“ఈ పిల్లికి ఉన్న పట్టుదల, ఆసక్తి మనకి ఉంటే ఎంత బావుణ్ణు!” అని కొంతమంది కామెంట్ చేస్తే, మరికొంతమంది “నమ్మలేకపోతున్నా.ప్లీజ్ ఇది ఎలా సాధ్యమయిందో మాకు ఎవరైనా వివరించండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఈ వీడియోకి ఇప్పటివరకు 9 వేల లైకులు, 90 వేల వీక్షణలు లభించాయి.