సొంతవాహనాల్లో డ్రైవ్ చేసేవారిని ఉద్దేశించి ఓ యువకుడు పంపిన మెసేజ్ ఇది.! అందరికి షేర్ చేయండి!

సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించే మిత్రులంద‌రికీ 4 జాగ్ర‌త్త‌లు* 1.బ్రేకులు చ‌క్రాల‌కే గాని కారుకు కాదు.

70-80 కిలోమీట‌ర్ల లోపు అయితే, స‌డెన్ బ్రేకేస్తే కారు ఆగుతుంది.కానీ అంత‌కు మించితే బ్రేకు వ‌ల్ల ఉప‌యోగం లేదు.2.ప్రమాదాలు ఎవ‌రూ ఆప‌లేరు గాని.

మ‌రీ ఇలా ఆగిఉన్న లారీల‌ను ఢీకొట్ట‌డం మాత్రం క‌చ్చితంగా స్వ‌యంకృతాప‌రాధ‌మే.డ్రైవింగ్‌లో జాగ్ర‌త్త లేన‌పుడు మాత్ర‌మే ఇది జ‌రుగుతుంది.3.మీరు హ‌ర్ట‌యినా ప‌ర్లేదు గాని.

మీరేమీ ప్ర‌ధాని కాదు, సీఎం కాదు.మీరు కొంచెం లేటెల్తే కొంప‌లేం మునిగిపోవు.

Advertisement

పైగా మీ కొంప మునిగిపోయే అవ‌కాశాలెక్కువ‌.స్పీడు 160 దాకా కూడా వెళ్లొచ్చు.

కానీ స్ట్రెయిట్ హైవేలు కాన‌పుడు 80 కి.మీ.కంటే, రాత్రి ప్ర‌యాణాల్లో 80-100 కంటే ఎక్కువ‌ స్పీడు క‌చ్చితంగా మిమ్మ‌ల్ని చంపేస్తుంది.4.అయినా రాత్రిపూట సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అర్జెంటుగా మీరు ఉద్ద‌రించాల్సిందేంటో ఆలోచించాలి.

ముందుగా పోయి చేసేదేముంది.

చివరగా "రిస్కు." *వ్యాపార‌ల్లో చేస్తే డ‌బ్బులు పోతాయి*.*రోడ్ల మీద చేస్తే ప్రాణాలు పోతాయి* *మీరు లేకుంటేమిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పడే బాధను ఊహించి జాగ్రత్త గా డ్రైవ్ చేయండి* జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా మన ప్రాణాలని నిలుపుకుందాం.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఎదుట వచ్చే వారి ప్రాణానికి హామీ ఇద్దాం.వేగం వద్దు.ప్రాణం ముద్దు నిదానమే ప్రదానం అని ఊరికే అనలేదు భయ్యా, ఆలోచించండి, ఆచరించండి.80Kmph స్పీడ్ కి 100-120kmph స్పీడ్ కి మధ్య తేడా కేవలం 10 నిమిషాలు మాత్రమే.లేటైతే పోయేది ఏమి లేదు, కానీ తొందర పడితే పోయేది కొన్ని జీవితాలు.

Advertisement

ఇట్లు.మీ శ్రేయోభిలాషి.

తాజా వార్తలు