వైరల్ : స్కూటీపై వెళుతుంటే గుండె పోటు వచ్చింది.. ఆ తర్వాత పాపం అతను??

మృత్యువు ఎప్పుడు, ఎవర్ని, ఎలా కబళిస్తుందో ఎవరికీ తెలియదు.కానీ కొంతమందికి మాత్రం చావు అనేది చెప్పే వస్తుంది.

 Viral: I Had A Heart Attack While Riding A Scooty  Then Sadly He, Viral Latest,-TeluguStop.com

అది ఎలా అనుకుంటున్నారా.ఏదన్నా అనారోగ్య కారణాల వలన ఒక నెలనో లేక ఒక సంవత్సరమో బతుకుతారని డాక్టర్స్ చెప్పినప్పుడు వాళ్ల మృత్యువు వాళ్ళకి తెలిసిపోతుంది.

కానీ ఇలా అందరి విషయంలో జరగదు.కొంతమంది పాపం అర్ధాంతరంగా మరణిస్తూ ఉంటారు.

వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు.కానీ చావు అనేది ప్రమాదం రూపేణా రావొచ్చు.

లేదంటే ఉన్నటుండి గుండె ఆగిపోవచ్చు.నడిచే వ్యక్తి ఇలా అనుకోకుండా చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.

ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

చావు ఎప్పుడు ఎలా వస్తుందో అని తెలపడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.

వీడియో ప్రకారం ఒక ఇద్దరూ వ్యక్తులు స్కూటీపై రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నారు.ఉన్నటుండి స్కూటీ వెనుక కూర్చున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో నడిరోడ్డుపైనే కుప్పకూలిపోతాడు.

ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.

మరి అతని వివరాలు చూస్తే జడ్చర్ల పట్టణంలోని పాతబజార్ కు చెందిన రాజు అనే యువకుడు ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

కాగా ఈ నెల 19వ తేదీ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని తన మిత్రులకు చెప్పడం జరిగింది.

అప్పుడు వెంటనే ఒక మిత్రుడు స్కూటీ మీద రాజుని ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు.కానీ మార్గమధ్యంలో రాజుకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో స్కూటీ పై నుంచి జారి రోడ్డుపై కిందపడిపోయాడు.

అక్కడిక్కడే చనిపోయాడు.వెంటనే అతను మిత్రుడు రాజును రోడ్డు పక్కకు తీసుకెళ్లడం మనం సీసీ టీవీ లో చూడవచ్చు.

అనుకోకుండా ఇలా రాజు చనిపోవడంతో అతని కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube