25 లక్షలకు అవార్డు అమ్మేసిన విజయ్ దేవరకొండ... అంత అవసరం ఏమొచ్చిందబ్బా?

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలలో నటించాలన్న ఇష్టం కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.అయితే ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు.

 Vijay Devarakonda Sold The Award For 25 Lakhs What Is The Need , Vijay Devarakon-TeluguStop.com

ఈ విధంగా సొంత టాలెంట్ తో అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక విజయ్ దేవరకొండ నేడు (మే 09) పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.

Telugu Arjun Reddy, Award Lakhs, Filmfare-Movie

ఈ క్రమంలోనే ఈ రౌడీ హీరోకి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులు,సినీ సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఆయన గురించి ఎవరికీ తెలియనటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా ఒక సినిమాలో నటించినందుకు ఎలాంటి అవార్డ్స్ వచ్చిన ఆ సినిమా గుర్తుగా అవార్డులను భద్రంగా దాచుకుంటారు.కానీ విజయ్ దేవరకొండ మాత్రం తనకు వచ్చిన అవార్డ్ అమ్మేసినట్టు తెలుస్తోంది.

Telugu Arjun Reddy, Award Lakhs, Filmfare-Movie

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమాకు గాను ఈయనకి బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ ( Best Actor Filmfare ) అవార్డు వచ్చింది.ఈ అవార్డును విజయ్ దేవరకొండ వేలం వేసి 25 లక్షల రూపాయలకు అమ్మి వేశారు.ఇలా సినిమాకు పూర్తిగా వచ్చిన ఈ ఫిలింఫేర్ అవార్డు 25 లక్షలకు అమ్మాల్సిన అవసరం ఏమి వచ్చిందనే విషయానికి వస్తే ఈ అవార్డు అమ్మి వచ్చిన 25 లక్షల రూపాయలను ఆపత్కాలంలో ప్రజాసేవ కోసం ప్రభుత్వం ఉపయోగించుకునే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించారు.ఇలా తన అవార్డు ద్వారా వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారని తెలిసి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube