కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay Joseph ) ఏ సినిమా చేసిన అది సంచలనమే.అంతగా ఈ హీరో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.
తమిళ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ అందుకుని దూసుకు పోతున్న విజయ్ చేస్తున్న సినిమాలన్నీ కోట్లకు కోట్లు రాబడుతూ నిర్మాత జేబులను నింపుతున్నాయి.విజయ్ కు ప్లాప్ సినిమాకు కూడా 200 కోట్లను రాబట్టే సత్తా ఉంది.
అందుకే ఈయన సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.కోలీవుడ్ నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు మార్కెట్ ఉంది.
దీంతో రిలీజ్ కు ముందే ఈయన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి.మరి విజయ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీకి కూడా భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమా ( LEO Movie )చేస్తున్నాడు.ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది.అందుకే రిలీజ్ ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంటున్నట్టు టాక్.కోలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ జరిగినట్టు టాక్ అందుతుంది.లియో సినిమాకు ఒక్క యూఎస్ లోనే 5 మిలియన్ డాలర్స్ బిజినెస్ జరిగినట్టు టాక్…
అన్ని భాషల్లో కలిపి 5 మిలియన్ డాలర్స్ దాటి వసూళ్లు రాబడితే కానీ ఈ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వదు అనే చెప్పాలి.ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.