తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల అమెరికాకు వెళ్లిన రేవంత్ అక్కడ సీతక్క సీఎం కావచ్చు అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.తాజాగా మరోసారి ఉచిత విద్యుత్ అంశంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ( Congress in Telangana )అధికారంలోకి వస్తే ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ చేసిన ప్రకటన పై పెద్ద దుమారమే రేగుతుంది.దీనిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్( BRS ) పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ లోనూ రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komati Reddy Venkata Reddy )స్పందించారు.రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.రైతులకు 24 గంటలు కరెంట్ అవసరంలేదని, ఎనిమిది గంటలు ఇస్తే సరిపోతుంది అంటూ రేవంత్ మాట్లాడడం సరికాదని , రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దీనికి పార్టీతో సంబంధం లేదని వెంకటరెడ్డి అన్నారు.
అసలు రేవంత్ రెడ్డి చెప్పింది ఫైనల్ ఎలా అవుతుంది అని కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని వెంకటరెడ్డి అన్నారు.రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చి తీరుతామని వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తానైనా, రేవంత్ రెడ్డి అయిన పార్టీ కోఆర్డినేటర్స్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సొంతం కాదని వ్యాఖ్యానించారు.తాను సీనియర్ నాయకుడినని , అవసరమైతే పార్టీలో తాను చెప్పిందే నడుస్తుందంటూ వెంకట్ రెడ్డి అన్నారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ రంగంలోకి దిగిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు .విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ మండిపడ్డారు.కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు, కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం తీవ్రంగా మండిపడుతోంది.ఈ విషయం పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ వ్యతిరేక వర్గం సిద్ధమవుతోంది.