వెల్లంపల్లి శ్రీనివాస్,వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి.నాపై నమ్మకం ఉంచిదేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.
మంత్రిగా సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించాను.మంత్రిగా దేవాదాయ శాఖ భూములు రక్షణ, ఆలయాల భద్రతకు పెద్ద పీట వేసాను.
మంత్రిగా దుర్గ గుడికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నా.దుర్గ గుడి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాం.
గత ప్రభుత్వం పుష్కరాల పేరుతో కూల్చేసిన గుళ్లను మూడేళ్ళలో నిర్మించాం.అంతర్వేది రధం పునర్నిర్మాణం చేసాం, అంతర్వేది ఆలయం అభివృద్ధి చెస్తున్నాం.
దేవాదాయశాఖలో ఏ నిర్ణయం తీసుకున్న సీఎం అడ్డు చెప్పలేదు.అర్చకులకు వంశపారంపర్యంగా కొనసాగింపు,ఇళ్ల నిర్మాణం లాంటి వాటిని ఆమోదించేలా అడుగులు వేసాను.టీడీపీ,జనసేన తొత్తులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.వైస్యులకు వైసీపీ అన్యాయం చేసిందని అసత్య ప్రచారం చేస్తున్నారు.14ఏళ్లలో ఆర్య వైస్యులకు చంద్రబాబు చేసింది సూణ్యం.దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 126 సత్రాలను తిరిగి వైస్యులకు దక్కేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఆర్య వైస్యుల మనోభావాలు దెబ్బతినెల ఉన్న చింతామణి నాటకాన్ని రద్దు చేసాం.ఆర్య వైస్యులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారూ.ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఘనంగా నిర్వహించలేని దౌర్భాగ్యంలో చంద్రబాబు ఉన్నాడు.జగన్ సీఎం అవ్వగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారు.ఆర్య వైస్యుల పట్ల టీడీపీ, జనసేన ముసలి కన్నీరు కారుస్తున్నాయి ఆర్య వైస్యులు చంద్రబాబు మాయలో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.దిక్కుమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నా నాకు అడక్కుండానే మంత్రి పదవి ఇచ్చారు,క్యాడర్ ఎవ్వరు ఆందోళన చెందదాల్సిన అవసరం లేదు.
ఎస్సి, ఎస్టీ,బిసిలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు.సీఎం జగన్ మంత్రి పదవులు ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు ఉంటుందని చెప్పారు మంత్రి పదవులకు రాజీనామాలు చేసామన్న ఆందోళన ఎవరికి లేదు 26జిల్లాలు అయిన 25 మంది మంత్రులు మాత్రమే ఉంటారు.
సామాజిక సమీకరణాల నేపద్యంలో మంత్రి పదవులు కేటాయింపులు జరిగాయి.ఎన్టీఆర్ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి రాబోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాకు మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి సంక్షేమం ఆగదు
.