రెండు వారాల పాటు ఉత్తర కొరియ సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్నాడని, ఆయన చనిపోతాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్య విషయమై ప్రధానంగా వార్తలు వచ్చాయి.
ఆయనకు చేసిన ఒక ఆపరేషన్ వికటించడంతో ఆయన మృత్యువుతో పోరాటం చేస్తున్నాడంటూ అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.అమెరికా కూడా ఆయన ఆరోగ్యం సరిగా లేదంటూ ప్రకటనలు చేసింది.
కిమ్ జాంగ్ ఉన్ దాదాపు రెండు వారాల పాటు పూర్తిగా కనిపించకుండా పోయి ఇటీవలే మళ్లీ ఒక ప్రారంభోత్సవం కోసం మీడియా ముందుకు వచ్చాడు.
కిమ్ చనిపోతే ఆయన సోదరి అధికారం దక్కించుకుంటుందనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త ఒకటి అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తుంది.అదేంటి అంటే కిమ్ కావాలనే తన ఆరోగ్యం గురించి పుకార్లు పుట్టించాడు. తాను చనిపోయానని, చావు బతుకుల్లో ఉన్నాను అంటూ తెలిసిన సమయంలో తన కింద ఉన్న అధికారులు, తన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, వారిలోంచి ఎవరైనా తిరుగుబాటు దారులు వస్తారా అనే చూసేందుకు కిమ్ అలా చేశాడట.గూడాచారుల ద్వారా ఎవరైతే ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా పనులు చేశారో, తన అధికారంను దక్కించుకునేందుకు చూశారో వారిని పట్టుకుని చంపేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి కిమ్ మరోసారి తన నియంత బుద్దిని ఈ రకంగా చూపించాడంటున్నారు.