క్రెడిట్ కార్డు దీని గురించి తెలియని వారంటూ ఉండరు.దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
అయినా దీని గురించి పూర్తి స్థాయిలో ఎవరికీ తెలీదు.ఇందులోని రివార్డు పాయింట్లు ఎలా ఉపయోగించుకోవాలో సరైన అవగాహన ఉండదు.
ఈ రివార్డు పాయింట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కార్డును తెలివిగా ఉపయోగించుకుంటే ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది.
కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు వివిధ కంపెనీలతో కలిసి రివార్డు పాయింట్లు, బ్రోచర్లు అందిస్తుంటాయి.ట్రావెల్ టికెట్స్, రెస్టాంరెంట్లలో డిస్కౌంట్లు, విమాన ప్రయాణాల్లో రాయితీలను పొందవచ్చు .ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా రివార్డు పాయింట్లు సరిగ్గా వాడకపోవచ్చు.
మనం ఎంత ఖర్చు చేస్తే అన్ని రివార్డులను పొందవచ్చు.
రివార్డు పాయింట్లకు కాలపరిమితి ఉంటుంది.ఎన్ని రివార్డులు ఉన్నాయి? వాటిని ఎక్కడ ఉపయోగించుకోవాలో ముందు తెలుసుకోవాలి.నిర్ణీత వ్యవధిలో నిర్ధేశిత మొత్తాన్ని ఖర్చు చేస్తే అదనపు పాయింట్లు జమ అవుతాయి.అన్ని క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్లు రావచ్చు.రాకపోవచ్చ .ముందుగానే కార్డు తీసుకొనేటప్పుడు చెక్ చేసుకోవాలి.కొన్ని కార్డుల్లో పాయింట్లు బదులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వస్తాయి.కొన్నింట్లో డిస్కౌంట్లో వస్తాయి.ఇలా కార్డుపై ఎదో ఒక ఉపయోగం ఉంటుంది.
రివార్డు పాయింట్లను రీడిమ్ చేసుకొనేటప్పుడు వాటి విలువను దృష్టిలో ఉంచుకోవాలి.
ఒక రివార్డు పాయింట్ విలువ 20 పైసలు ఉంటే, వేరే వస్తువు తీసుకుంటే విలువ 30పైసలు ఉండొచ్చు.కొన్నిసార్లు ప్రతి 2వేల పాయింట్లకు 500 పరిగణిస్తారు.
మనం తీసుకున్న వస్తువు, వాడుతున్న కార్డు, సమయాన్ని బట్టి పాయింట్లు మారుతూ ఉంటాయి.వాల్యూ చెక్ చేసుకొని రివార్డు పాయింట్లను త్వరగా రీడీమ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు.
మీ రివార్డు పాయింట్లు ఎక్కడ, ఎప్పుడు ఎంత వాల్యూ లభిస్తుందో తెలుసుకొని అప్పుడు వాడితే మంచింది.పాయింట్లు తెలుసుకోవాలంటే కంపెనీ వెబ్ సెట్లలో లేదా.
బ్యాంక్ నెట్ బ్యాకింగ్ లో, పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.క్రెడిట్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే మీ రివార్డు పాయింట్ల వివరాలను తెలుసుకొనే అవకాశం ఉంది.
వాట్సప్ పే వాడుతున్నారా.అయితే జాగ్రత్త.
వాట్సప్ తమ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోగలిగే ఫీచర్ ను గతంలో పరిచయం చేసింది.ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా అంతా సక్సెస్ కాలేదు.2020లో వాట్సప్.డిజిటల్ పేమెంట్స్ ను సర్వీస్ ను ప్రవేశపెట్టింది.2020 ఫిబ్రవరి 7న ఈ పేమెంట్ సర్వీస్ కు ఎన్ ఫీసిఐ (NPCI)అమోదం లభించింది.వాట్సప్ ద్వారా పేమెంట్స్ చేయాలంటే ముందుగా డబ్బు పంపే వ్యక్తి నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి.
ఆ తర్వాత యూజర్ వాట్సప్ ఆకౌంట్లలో తమ యూపీఐ ఐడిని నమోదు చేయడం ద్వారా నగదును చెల్లించవచ్చు.యూజర్ల తమ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు డబ్బు పంపాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
అవతలి యూజర్ కూడా వాట్సప్ పేమెంట్ ను యాక్టివేట్ చేసుకుంటే యూజర్లు డైరెక్టుగా చాట్ బాక్స్ నుంచే నగదును పంపవచ్చు.వాట్సప్ పేమెంట్ ఫీచర్ ద్వారా బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
వాట్సాప్ లో ఒకటి కంటే ఎక్కువ ఆకౌంట్లు యాడ్ చేస్తే పేమెంట్ చేయడం కోసం ప్రైమరీ బ్యాంకు ఆకౌంట్ ను సెట్ చేసుకోవాలి.ఆకౌంట్ ను ఎలా క్రియెట్ చేయాలంటే వాట్సప్ లేటెస్ట్ వర్సన్‌ను డౌన్ లోడ్ చేసి, టాప్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి.
పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్యాంకు పేరును సెలెక్ట్ చేసుకోవాలి.బ్యాంకు లింక్ చేసిన మోబైల్ నెంబర్ తో లాగిన్ వేరిఫై చేసుకోవాలి.ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీ బ్యాంకు ఆకౌంట్ కి వాట్సప్ ఆకౌంట్ లింక్ అవుతుంది.తర్వాత యూపీఐ పిన్ ను సెట్ చేయాలి పేమెంట్ ఎలా చేయాలో తెలుసుకుద్దాం వాట్సప్ సెట్టింగ్‌లో పేమెంట్స్ పై క్లిక్ చేసి బ్యాంకు ఆకౌంట్ ను ఎంటర్ చేయాలి.
ప్రైమరీ ఆకౌంట్ ఎంచుకున్నాక.పేమెంట్ సులభంగా చేయోచ్చు.
బ్యాంకు ఆకౌంట్ ను తొలగించాలంటే సెట్టింగ్స్ లో పేమెంట్స్ ను ఎంచుకోవాలి.తర్వాత రీమూవ్ బ్యాంకు ఆకౌంట్ అని కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే రీమూవ్ అవుతుంది.