Nagarjuna : కేవలం వ్యాపారం మాత్రమే కాదు నాగార్జున లో ఇలాంటి ఒక యాంగిల్ ఉందా ?

సినిమా హీరోలు మాత్రమే ఎప్పుడు సక్సెస్ ఉంటే మాత్రమే అందరి చేత గుర్తింపబడతారు అనుకుంటే పొరపాటే.ఇంచుమించు దర్శకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.

 Untold Points About Nagarjuna And V N Adithya-TeluguStop.com

ఒక్క సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే చాలు అతడి మొహం ఇండస్ట్రీలో ఎవ్వరు చూడరు.ఏ హీరో కూడా అతనికి డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడడు.

ఏ నిర్మాత కూడా అతనితో సినిమా తీయడానికి ముందుకు రాడు.ఇన్ని గండాలు దాటుకొని ఏదో ఒక సినిమా రూపం లో బయటకు వస్తే అది హిట్ అవుతుందో లేదో తెలియదు.

అందుకే దర్శకుడు అనే వాడికి మిగతా వారితో పోలిస్తే ఇండస్ట్రీలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ.అయితే నాగార్జున( Nagarjuna ) విషయానికి వస్తే మిగతా హీరోల కన్నా కూడా ఆయన చాలా భిన్నంగా ఆలోచిస్తారు.

తనకు గతంలో హిట్ ఇచ్చారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు.ప్లాప్ దర్శకుడు అయినా పర్వాలేదు ఆయన చేతిలో సినిమా పెట్టడం అనేది కేవలం ఆయనకు మాత్రమే చెల్లింది.

Telugu Aarthi Agarwal, Boss, Nagarjuna, Nayanthara, Nenunnanu, Tollywood, Vn Adi

నాగార్జున నేనున్నాను ( Nenunnanu )అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.శ్రీయ, నాగార్జున, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.అయితే ఈ సినిమాకు దర్శకుడిగా విఎన్ ఆదిత్య( V.N.Aditya ) వ్యవహరించారు.ఈ సినిమా విజయం తర్వాత నాగార్జున & ఆదిత్య కాంబినేషన్ లో మరొక చిత్రం రావాల్సి ఉంది.

అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య కాస్త గ్యాప్ ఉండడంతో ఆ మధ్య కాలంలోనే మనసు మాట వినదు అనే ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేశారు ఆదిత్య.కానీ ఆ సినిమా కొన్ని కారణాలవల్ల పరాజయం పాలవడంతో ఇక వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో మరొక సినిమాలో నాగార్జున నటించరు అని అంతా భావించారు.

ఎవరు ఊహించని విధంగా నాగార్జున వీయన్ ఆదిత్య చేతిలో బాస్ అనే సినిమా అని పెట్టారు.ఆ సినిమా యావరేజ్ గాని నడిచినప్పటికీ నాగార్జున ఆదిత్య ని అంతలా నమ్మడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Telugu Aarthi Agarwal, Boss, Nagarjuna, Nayanthara, Nenunnanu, Tollywood, Vn Adi

పైగా బాస్ సినిమా పరాజయానికి కొన్ని నిజాయితీతో కూడిన వివరణలు ఉన్నాయి.అందులో ఒకటి ఈ సినిమాకు ముందే శ్రీరామదాసు సినిమా వచ్చి అతిపెద్ద విజయం సాధించడంతో పాటు అంత పెద్ద క్లాసిక్ హిట్ తర్వాత ఏ పాత్రలో నటించినా కూడా నాగార్జున ని జనాలు ఆమోదించరు అని అప్పటికే కొంత అభిప్రాయం ఉంది.దాంతో అందరూ ఊహించినట్టుగానే బాస్ పెద్ద విజయం అయితే సాధించలేదు కానీ బాస్ సినిమా ఆదిత్య చేతిలో పెట్టడానికి ముందే పలువురు నాగార్జునను హెచ్చరించారు.ఎందుకంటే మనసు మాట వినదు సినిమా పరాజయం పొందింది కాబట్టి కానీ నేనున్నాను సినిమా టైంలో తనతో ఆదిత్య ఎలా ఉన్నారు? ఎలా తీయగలరు అని, ఆదిత్య పై నమ్మకం ఉంది కాబట్టే ఆయనకు మరొక అవకాశం ఇచ్చారు.ఎప్పుడు వ్యాపారం మాత్రమే కాదు నిజాయితీ కూడా ఉండాలని నాగార్జున నమ్ముతారు అని ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube