పపుల్స్ మార్చ్ పాదయాత్రకు అపూర్వ స్పందన...!

నల్లగొండ జిల్లా:జిల్లాలో కొనసాగుతున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

సోమవారం ఉదయం 95వ రోజు నల్లగొండ నియోజకవర్గం చిన్న సూరారం గ్రామం నుంచి ప్రారంభమై నకిరేకల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా పలువురు ఉపాధి కూలీలు, నిరుద్యోగులు భట్టిని కలిసి తమ కష్టాలను ఏకరవు పెడుతూ వినతి పత్రాలు అందజేశారు.స్పందించిన ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్( CM KCR ) మోసపూరిత హామీలతో పాలన సాగిస్తున్నాడని విమర్శించారు.

వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మీ సమస్యలు తీరిపోతాయని హామీ ఇచ్చారు.పాదయాత్రకు నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ( Congress party ) శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని ఆయన వెంట నడిచారు.దీంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జనసంద్రంగా మారింది.

Advertisement

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్,నకిరేకల్,నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య,దైద రవీందర్,నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నాయకులు కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, ఉప్పునూతల వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

Latest Nalgonda News