శాశ్వత పథకమైనా కెసీఆర్ డోంట్ కేర్

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెత తెలుసు కదా.తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ అదే టైపు.

 Kcr Cancelled Bangaru Thalli Scheme-TeluguStop.com

తాను ఏది అనుకుంటే అది చేస్తారు.ఎవ్వరినీ ఖాతరు చేయరు.

రాష్ట్రాన్ని పూర్తిగా వంద శాతం బంగారు తెలంగాణ చేస్తానని చెబుతున్న కెసీఆర్ ఆంధ్రా పాలకుల పథకాలు ఏవీ అమలు జరగకూడదని పట్టుదలగా ఉన్నారు.

ఆ పట్టుదలతోనే ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని కెసీఆర్ రద్దు చేసి పారేశారు.

ఆడ పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశ పెట్టారు.తరువాతి ప్రభుత్వాలు దీన్ని రద్దు చేయకుండా శాశ్వతంగా ఉండేలా చట్టం చేశారు.

బంగారు తల్లి కిరణ్ మానస పుత్రిక అని చెప్పవచ్చు.

కానీ ఈ పథకం కొనసాగించడం వృధా అని భావించిన కెసీఆర్ పర్మినెంట్ పథకమైనా సరే రద్దు చేసి పారేశారు.

రాష్ట్ర విభజన చట్టం రద్దుకు అవకాశం కల్పించింది.కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తుండగా కిరణ్ పథకం అనవసరమని కెసీఆర్ అభిప్రాయం.

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ మీద కేసీఆర్కు పీకల దాకా కోపం ఉంది కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube