రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళి

నల్లగొండ జిల్లా:అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసి, తనకున్న జ్ఞాన సంపదతో దేశంలో ఎన్నో సామాజిక సంస్కరణలకు నాంది పలికి, ప్రజలంతా స్వేచ్ఛా, సమానత్వాలతో జీవించాలని తన జీవితాన్ని,కుటుంబాన్ని దేశం కోసం త్యాగం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,ప్రపంచ జ్ఞాని డాక్టర్‌ బాబాసాహెబ్‌,బీఆర్ అంబేడ్కర్‌ 133 వ,జయంతి వేడుకలు ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

దీనితో పట్టణాలు పల్లెల్లో సైతం ఆ మహనీయుని పుట్టిన రోజును కులమతాలకు అతీతంగా పండుగలా జరుపుకున్నారు.

ఈసందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ విగ్రహాలకు,చిత్ర పటాలను పూలమాలలు వేసి జై భీమ్ నినాదాలతో ఘననివాళులర్పించారు.అనంతరం పలువురు వక్తలు మాట్లడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏ ఒక్క వర్గానికో,కులానికో సొంతం కాదని,ఆయన అందరివాడని,భారత దేశ జ్ఞాన సంపద,ప్రపంచంలో మేధావుల్లో ఒకరని,ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు,హక్కులను తెలిపిన మహానీయుడని కొనియాడారు.

Tribute To Constitution Maker Ambedkar-రాజ్యాంగ నిర్మ�

అంబేడ్కర్ దేశంలోని అణగారిన వర్గాల, మహిళల ఆర్థిక,సామాజిక సాధికారికత కోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారని గుర్తు చేశారు.రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం అన్నారు.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు,సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారని, రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారని,జీవితాంతం అణగారి వర్గాల కోసం పోరాడి ఆశాజ్యోతిగా నిలిచారని, దళితులు,మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జయంతి రోజున ఆయనను స్మరించుకోవడం ఈ దేశ పౌరులు బాధ్యతని అన్నారు.ఆ మహనీయుడు కలలు గన్న సమసమాజ స్థాపనకు ఈ దేశ ప్రజలంతా ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.

Advertisement

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ సంఘాల అధ్వర్యంలో నూతన విగ్రహావిష్కరణలు చేశారు.పలు చోట్ల పండ్లు,స్వీట్స్ పంపిణీ చేశారు.

Advertisement

Latest Nalgonda News