ఒక్క అవకాశం ఇచ్చి చుడండి.. రోహిత్ మరో బిగ్ స్టార్ అవుతాడు !

కొంతమంది హీరోగా ఒకటి రెండు సినిమాల్లో బాగానే కనిపించిన ఎందుకో సక్సెస్ అవడంలో మాత్రం ఫ్లాప్ అవుతూ ఉంటారు.కానీ నటనలో మిగతా హీరోలకు ఏమాత్రం తీసుపోరు.

 Hero Rohit Will Be A Super Star In His Second Innings Details, Hero Rohit, Hero-TeluguStop.com

కాస్త అదృష్టం కలిసి రాక వెనక్కి వెళ్ళిపోతారు.అలాంటి హీరోలలో 16 టీన్స్ హీరో రోహిత్( Hero Rohit ) కూడా ఒకరు.1998 రోజు స్వర్ణక్క అనే సినిమాతో మొట్టమొదటిగా క్యామియో రోల్ చేశాడు రోహిత్.ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వే కావాలి అనే సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించాడు.

మొట్టమొదటిగా 2001లో 16 టీన్స్ అనే సినిమాతోనే హీరోగా మారాడు.అడపాదడపా దాదాపు 10 నుంచి 12 సినిమాల్లో హీరోగా నటించిన ఎందుకో అతనికి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు.

Telugu Rohit, Rohit Offers, Janakiweds, Rapid, Shankardada, Tollywood-Movie

2005 వరకు హీరోగా నటించిన ఆ తర్వాత ఉన్నటువంటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు.2007లో శంకర్ దాదా జిందాబాద్( Shankar Dada Zindabad ) అనే సినిమాలో చిన్న పాత్రలో నటించాడు.అంతేకాదు హీరో తరుణ్ సినిమా నవవసంతం లో( Nava Vasantham ) కూడా ఒక రోల్ లో కనిపించాడు.హీరోగా ఎలాగో కెరియర్ కనిపించక క్యారెక్టర్ గా కూడా మారుదామని ప్రయత్నించాడు.

అలాగే 2010లో మా అన్నయ్య బంగారం అనే సినిమాలో కూడా కనిపించిన అనుకున్నన్ని అవకాశాలైతే రోహిత్ కి రాలేదు.దాంతో దాదాపు 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగానే ఉన్నాడు.

రెండు మూడు ఏళ్ల క్రితం నుంచి సినిమా లో బిజీ అవ్వాలని క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

Telugu Rohit, Rohit Offers, Janakiweds, Rapid, Shankardada, Tollywood-Movie

ఒకటి రెండు పర్వాలేదనిపించిన అవి రిలీజ్ కి నోచుకోలేదు.ఇక ఈ సంవత్సరం రామ్ అనే పేరుతో ఓ సినిమా విడుదలైంది ఇందులో ధన్య బాలకృష్ణన్ మెయిన్లో రోల్ లో నటించగా రాపిడ్ యాక్షన్ మిషన్( Rapid Action Mission ) అనే పేరుతో ఈ సినిమా పర్వాలేదనిపించినా ఇది కూడా రోహిత్ కెరియర్ కి పెద్దగా ఉపయోగపడేలా కనిపించడం లేదు.సెకండ్ ఇన్నింగ్స్ లో చాలామంది ఫెయిల్ అవుతారు.

కానీ జగపతి బాబు లాంటివారు బాగానే హిట్ అవుతున్నారు.నటన బాగా తెలిసిన రోహిత్ లాంటివారికి తెలుగు సినిమా ఇండస్ట్రీ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube