ఈ సింపుల్ చిట్కాలు ఒత్తైన‌, పొడ‌వాటి జుట్టును అందిస్తాయి..!

ఒత్తైన, పొడ‌వాటి జుట్టు క‌లిగిన అమ్మాయిలు ప్ర‌స్తుత రోజుల్లో బాగా త‌గ్గిపోయారు.వాతావ‌ర‌ణంలో మార్పులు, పెరిగిన కాలుష్యం, ఆహారపు అల‌వాట్లు, ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ గ్రోత్ త‌గ్గిపోతుంది.

 These Simple Tips Will Give You Thick And Long Hair! Simple Tips, Hair Care, Hai-TeluguStop.com

దాంతో జుట్టు ఎదుగుద‌ల ఆగిపోతుంది.అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టి ఒత్తైన‌, పొడ‌వాటి జుట్టును అందించే సింపుల్ చిట్కాలు కొన్ని ఉన్నాయి.

వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పెద్ద అల్లం ముక్క‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇలా క‌ట్ చేసుకున్న అల్లం ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో ఐదారు స్పూన్ల అలం జ్యూస్‌, మూడు టేబుల్ స్పూన్ల గోరు వెచ్చ‌టి కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌పై అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా నాలుగు రోజుల‌కు ఒక‌సారి చేస్తే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.ఫ‌లితంగా జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

Telugu Care, Care Tips, Latest, Long, Simple Tips, Thick-Telugu Health Tips

అలాగే మ‌రో సింపుల్ చిట్కా ఏంటంటే.ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల శ‌న‌గ‌పిండి, మూడు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్‌, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని లూస్ స్ట్ర‌క్చ‌ర్ లో మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల మొత్తానికి ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.న‌ల‌బై నిమిషాల అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా త‌ల స్నానం చేయాలి.ఈ సింపుల్ చిట్కాను పాటించినా ఒత్తైన‌, పొడ‌వాటి జుట్టును త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube