మిర్యాలగూడలో ట్రాఫిక్ అస్తవ్యస్తం

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యతో పట్టణ ప్రజలు సతమతవుతున్నారని,ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ కూడా వెళ్ళలేని దుస్థితిలో ట్రాఫిక్ జామ్ అవుతుందని బీసీ సంఘం నాయకులు అన్నారు.

మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ కు బీసీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చరమగీతం పాడాలని వినతపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు, గణేష్ మార్కెట్,పెద్ద బజార్,డాక్టర్స్ కాలనీ, కూరగాయల మార్కెట్ ముందు,ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉందన్నారు.ఇదే విషయం ట్రాఫిక్ ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

పెద్ద బజారు,రాఘవ థియేటర్ దగ్గర,కుండల బజారులో రెండు రోజులు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారని,మరల యధావిధిగా ట్రాఫిక్ మారిపోయిందన్నారు.డాక్టర్స్ కాలనీలో చిన్న అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితులు ఉన్నాయని, ద్విచక్ర వాహనదారులు హాస్పిటల్ ముందు కాకుండా రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణ పరిధిలో అన్ని చోట్లా ట్రాఫిక్ కి క్లియర్ చేసి వాహనదారులకు ఉపశమానం కలిగించాలని కోరామన్నారు.తమ విజ్ఞప్తిపై ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Advertisement

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కన్వీనర్ చేగొండి మురళీ మోహన్,జిల్లా కార్యదర్శి బంటు కవిత తదితరులు పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు...2025 జనవరిలో పరీక్షల నిర్వహణ
Advertisement

Latest Nalgonda News