తెలుగు రాష్ట్రాల్లో కల్లు అంటే తెలియని వారు ఉండరు.పల్లెటూరులో ఇది ఫేమస్.
అయితే ఇది సిటీలో కూడా దొరుకుతుంది.కానీ పల్లెటూరిలో దొరికినంత స్వచ్ఛంగా సిటీలో ఉండదు.
కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది.స్వచ్ఛమైన కల్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సైతం చెబుతారు.
ఈ కల్లు లో కూడా చాలా రకాలు ఉంటాయి.
తాటి కల్లు, ఈత కల్లు అన్ని చోట్ల దొరుకుతుంది.
అందరికి తెలుసు.కొన్ని ప్రాంతాల్లో వేప కల్లు, చింత కల్లు కూడా దొరుకుతాయని విన్నాం.
అయితే ఇప్పుడు తెలంగాణ లో జిలుగు కల్లు ఫేమస్ అవుతుంది.కల్లు ప్రియులు పోటీ పడి మరి ఈ కల్లు ను లొట్టలేసుకుని ఆస్వాదిస్తూ తాగుతున్నారు.
ఈ కల్లు మాములు కల్లులా కాదు.దీనికి యమ డిమాండ్ ఉంది.
ఒక్క సీసా ఎంత పలుకుతుందో తెలుసా.ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ కల్లు ను అందిస్తారు.
అంతేకాదు ఈ కల్లు సీసా 500 రూపాయలకు సైతం కొనేందుకు ప్రజలు వెనుకాడడం లేదు.ఎందుకంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది.
ఈ జీలుగు కల్లు తాగితే కిడ్నీ రాళ్ళ సమస్యతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలు కూడా నయం అవుతాయట.
ఇంతకీ ఇన్ని ప్రయోజనాలు అందించే ఈ కల్లు ఎక్కడ దొరుకుతుందో తెలుసా.
తెలంగాణ జిల్లా లోని సూర్య పేట కాసరబాద గ్రామంలో ఈ జీలుగు కల్లు లభిస్తుందట.ఈ కల్లు తాటి, ఈత కల్లు కంటే రుచిగా ఉంటుందట.
అందుకే ఈ జీలుగు కల్లు కోసం జనం క్యూ కడుతున్నారు.ముందుగా కల్లు కోసం అడ్వాన్స్ బుక్ చేసుకుని మరి ఆ గ్రామం చేరుకుంటున్నారు.
ఈ గ్రామంలో నివసించే సైదులు అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి కల్లు గీయడానికి వెళ్ళాడట.అప్పుడు ఆ రాష్ట్రంలో జీలుగు కల్లు వాడుకలో ఉండడంతో అతడు నేర్చుకుని వచ్చి ఇక్కడ సొంత గ్రామంలో గీయడం మొదలు పెట్టాడట.అలా ఈ జీలుగ కల్లు ఫేమస్ అయ్యి ఇప్పుడు జనం ఎగబడుతున్నారు.