సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం అయితే మనుషులన్న తర్వాత వాళ్లు సెలబ్రిటీలైన సాధారణ ప్రజలైనా కూడా ఇలాంటి సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి.ఇక తెరపై ఎంతో అందంగా నవ్వుతూ అందరిని నవ్విస్తున్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు తెరవెనుక భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పాలి.
మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరందరూ కూడా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు మరి ఆ హీరోయిన్ ఎవరు వారి బాధపడుతున్నటువంటి జబ్బు ఏంటి అనే విషయానికి వస్తే.
సమంత:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత( Samantha )ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.ఈ వ్యాధికారణంగా సినిమాలకు కూడా విరామం ప్రకటించినటువంటి ఈమె ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇలియానా:
గోవా బ్యూటీగా దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఇలియానా( Ileana )ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.సన్నజాజితీగల ఎంతో నాజుగా ఉన్నటువంటి ఈమె బాడీ డిస్మోర్బిక్ డిజార్డర్ తో బాధపడ్డారు ఈ వ్యాధి కారణంగా ఈమె భారీ శరీర బరువు పెరిగిపోయారు.
ఇలా శరీర బరువు పెరగడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు.
స్నేహ ఉల్లాల్
అచ్చం ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్నటువంటి ఈమె జూనియర్ ఐశ్వర్య రాయ్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు అయితే కెరియర్ మొదట్లోనే పలు సినిమాలలో నటించినటువంటి స్నేహ ఉల్లాల్ ( Sneha Ullaal ) ఆటో ఇమ్యున్ డిజాస్టర్ అనే వ్యాధితో బాధపడ్డారు.ఇలా ఈ వ్యాధి కారణంగా ఉన్నఫలంగా స్పృహతప్పి పడిపోతూ ఉంటారు ఇలా షూటింగ్ లోకేషన్లలో ఎన్నోసార్లు ఈమె పడిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకొని తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
హంసానందిని:
ఐటమ్ సాంగ్స్ ద్వారా సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపినటువంటి హంసానందిని( Hamsa Nandini )అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ బారిన పడ్డారు.అయితే క్యాన్సర్ కోసం ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రస్తుతం మామూలు మనిషి అయ్యారు.అయితే ఈమెకి జన్యుపరమైనటువంటి క్యాన్సర్ కావడంతో క్యాన్సర్ కోసం విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారని చెప్పాలి.
నయనతార: సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayantara )కూడా ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారు.ఈమె మేకప్ వేసుకుంటే తన మొహం మొత్తం రెడ్ రాషష్ వస్తాయని తద్వారా ఈమె కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఈ వ్యాధికి చికిత్స తీసుకొని అనంతరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా ఎంతో అందంగా నవ్వుతూ కనిపించే ఈ హీరోయిన్స్ మాత్రమే కాకుండా మరి కొంతమంది హీరోయిన్స్ కూడా ఈ విధమైనటువంటి వ్యాధుల బారిన పడ్డారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.