తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) సీరియస్ అయ్యారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
శ్వేతపత్రంతో వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని హరీశ్ రావు పేర్కొన్నారు.గ్యారెంటీలను అమలు చేయడం లేదన్న ఆయన ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నామని తెలిపారు.
లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని( Congress Govt ) చీల్చి చెండాడే వాళ్లమని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.