పుట్టుక, మరణం అనేది మన చేతిలో ఉండే విషయం కాదు.కేవలం దేవుని యొక్క అంగీకారం వల్ల మన జనన, మరణాలు ఉంటాయి.
పుట్టిన వాడికి ఏదో ఒక రోజు మరణం కచ్చితంగా సంభవిస్తుంది.అయితే చనిపోయిన తర్వాత మన ఆత్మ స్వర్గానికి వెళ్తుందా? నరకానికి వెళ్తుందా? అన్న విషయం మనం బ్రతికి ఉన్నప్పుడు చేస్తే పుణ్య, పాప కార్యాల మీద ఆధారపడి ఉంటుంది.మనం బ్రతికి ఉన్నప్పుడు చేసినకొన్ని పాపాలు వల్ల నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో ఇక్కడ తెలుసుకుందాం…
వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం లో అష్టాదశ పురాణం ఒకటి.ఈ అష్టాదశ పురాణములో ఎటువంటి పాపములు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు అమలు చేస్తారో క్లుప్తంగా వివరించబడినది.
మనం బ్రతికి ఉన్నప్పుడు మనది కాని ఆస్తికోసం ఇతరులను హింసించడం లేదా బాధ పెట్టడం వంటి పాప కార్యాలు చేసినప్పుడు వారిని తమీస్రా అనే నరకానికి యమభటులు తీసుకు వెళ్ళి ఏటువంటి ఆహారం, నీరు లేకుండా వారిని వేధిస్తారు.తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారిని హింసించి బాధ పెడతారో అలాంటి వారిని కాల సూత్రం అనే నరకానికి తీసుకువెళ్లి, అక్కడ రాగి పాత్రలో వారిని నిలబెట్టి కింద మంటలు పెడతారు.
ప్రజలను పాలించే నాయకుడు అవినీతి పాలన చేసి వారి అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారు, వైతారాణి అనే నరకానికి తీసుకువెళ్తారు.ఇక్కడ ఆ నాయకుడిని అపరిశుభ్రమైన నదిలో వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి చెడు క్రిములు అతనిని వేధిస్తాయి.
ఇలా ఒక్కొక్క పాపం చేసిన వారిని ఒక్కొక్క రకమైన నరకానికి తీసుకువెళ్లి యమభటులు హింసిస్తారు.యమలోకంలో శిక్షలు వారు భూలోకంలో నివసించిన అప్పుడు చేసినటువంటి పాపాలను దృష్టిలో ఉంచుకొని శిక్ష విధిస్తారని, గరుడ పురాణం చెబుతోంది.