ప్రచారంలో పదనిసలు పోలీసుల కేసులు

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు వస్తున్న నేపధ్యంలో పార్టీల ప్రచార పర్వంలో చిత్ర విచిత్ర విన్యాసాలు చోటుచేసుకుంటున్నయి.

అందులో భగంగా సోమవారం మర్రిగూడ మండలంలో ఖుదాభక్షపల్లి గ్రామంలో బీజేపీకి చెందిన మహిళలు ప్రచారం చేస్తూ,చేతులతో పువ్వు గుర్తు వేస్తున్నారని టీఆర్ఎస్ జడ్పీటిసి ఆధ్వర్యంలో కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ మహిళల పట్ల టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.వారు చేసిన ఫిర్యాదు లేఖ యధాతధంగా To, The STATION HOUSE OFFICER, Marriguda, Nalgonda district.

విషయం:ఎన్నికల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు బూతులు తిడుతూ చంపుతామంటూ భౌతిక దాడి చేసిన అంశంపై ఫిర్యాదు సర్, మా పేరు బూరెల క్రిష్ణవేణి,కొప్పెర శ్యామల,బూరెల ఆండాలు.బీజేపీ కార్యకర్తలం.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలంలోని ఖుదాభక్షపల్లి గ్రామంలోని 223 పోలింగ్ బూత్ పరిధిలో మేం ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ స్థానిక జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి తన అనుచరులతో మా వద్దకు వచ్చారు.వస్తూనే గట్టిగా అరుచుకుంటూ చేయి పట్టుకుని గుంజారు.

Advertisement

లంజ ముండ ఇక్కడికి ఎందుకొచ్చారు? బ్రోకర్ ముండలారా మీ వేషమేంది? ఈ కండువా,టోపీ ఏంది? అంటూ దారుణంగా బూతులు తిట్టారు.అంతేగాకుండా మహిళలమని కూడా చూడకుండా మా చేయి పట్టుకుని పదేపదే గుంజుతూ మిమ్ముల్ని ఏదైనా చేస్తానే అంటూ బూతులు తిట్టారు.

మాకు రక్షణగా వచ్చిన మహిళలను కూడా బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారు.నేను ఫోన్ మాట్లాడుతుంటే నా ఫోన్ కూడా గుంజుకుని బూతులు తిట్టారు.

దాదాపు గంటపాటు చుట్టుముట్టి బయటకు వెళ్లనీయకుండా బూతులు తిడుతూ నిర్బంధించారు.దాదాపు గంట సేపు మానసిక ఇబ్బందికి గురిచేశారు.

దాదాపు గంట తరువాత ఎస్ఐ సైదాబాబు అక్కడికి వచ్చి జోక్యం చేసుకోవడంతో మమ్ముల్ని విడిచి పెట్టారు.ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న తమపై అకారణంగా చంపుతామంటూ బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడ్డ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డితోపాటు వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మనవి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠా అరెస్ట్...!

ధన్యవాదాలు.నోట్:ఫిర్యాదు పత్రంతోపాటు సంబంధిత వీడియోను కూడా జత చేశాం భవదీయ 1.బూరెల క్రిష్ణవేణి గ్రామం వట్టిపల్లి, మర్రిగూడ మండలం.

Advertisement

మొబైల్ – 9553543508 2.బూరెల అండాలు గ్రామం : వట్టిపల్లి, మర్రిగూడ మండలం మొబైల్ : 7075676654 కొప్పెర శ్యామల బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగోల్ డివిజన్, ఎల్బీ నగర్, హైదరాబాద్ 9553112969.

Latest Nalgonda News