Kantara Abhiroop Basu : కాంతార సినిమా క్లైమాక్స్ బోరింగ్.. సినిమా బాలేదన్న నిర్మాత?

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ థియేటర్లలో విడుదలైంది.

 Rishab Shetty Kantara Poorly Made Says Director Abhiroop Basu,abhiroop Basu,rish-TeluguStop.com

కన్నడ చిత్ర పరిశ్రమలోఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వివిధ భాషలలో కూడా విడుదల అయ్యి ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ ప్రముఖులు సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే తాజాగా ఓ నిర్మాత మాత్రం ఈ సినిమా పై స్పందిస్తూ సినిమా అసలు ఏ మాత్రం బాగోలేదని క్లైమాక్స్ చాలా బోరింగ్ గా ఉందంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా కాంతార సినిమాకి ప్రజలు సినీ ప్రముఖులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ క్రమంలోనే నిర్మాత అభిరూప్ బసు ఈ సినిమా గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ సందర్భంగా అభిరూప్ మాట్లాడుతూ.కాంతార సినిమా ప్రజల తెలివితేటలను అపహాస్యం చేసిందంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా ప్రజల జీవితాల్లో దైవ జోక్యాన్ని విశ్వసించేలా చేస్తుందని తెలిపారు.

సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాల్సి వస్తే కథ చాలా పేలవంగా తయారైందని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Telugu Abhiroop Basu, Cine, Climax, Kantara, Kantara Story, Rishab Shetty, Risha

ఈ సినిమాలో అసలు పాత్రకు ప్రామాణికత లేదు.ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది మాట్లాడుతూ క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.అయితే నాకు మాత్రం క్లైమాక్స్ ఏ మాత్రం నచ్చలేదని చాలా బోర్ అనిపించింది అంటూ అబిరూప్ తెలిపారు.

ఈ సినిమాని పాత స్టోరీ లైన్ తో కొత్తగా తీసారంటూ ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పడంతో ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube