విజయ్ దేవరకొండ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు పొందాడు.వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.
అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో రౌడీ కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యాడు.
ఇక ఇప్పుడు మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రెజెంట్ విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు విజయ్.
దీంతో విజయ్ తన ద్రుష్టి మొత్తం ఈ సినిమా మీదనే పెట్టాడు.అయితే ఈ సినిమా ఎప్పుడో లైగర్ రిలీజ్ ముందు ఆగిపోయింది.
ఇంత వరకు తిరిగి స్టార్ట్ కాలేదు.ఇప్పుడు విజయ్ రెడీ అనుకుంటే సమంత తన హెల్త్ కారణంగా ఈ సినిమా షూట్ వాయిదా తప్పేలా లేదు.
ఈమె తన వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.సమంత హెల్త్ కారణంగా ఖుషి సినిమా హోల్డ్ లో పడే అవకాశం ఉంది.దీంతో విజయ్ కూడా ఈ సినిమా పూర్తి చేయకుండా గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది.దీంతో విజయ్ దేవరకొండ తన ప్లాన్ ను మార్చుకున్నట్టు తెలుస్తుంది.

ఇతడు ఖుషి సినిమా అలా ఉండగానే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట.ఈ క్రమంలోనే విజయ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేసేందుకు రెడీ అయినట్టు టాక్ వస్తుంది.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.సమంత కోలుకునేలోపు కొత్త సినిమా స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట.ఆ తర్వాత మళ్ళీ ఖుషి సినిమాలో జాయిన్ అవుతాడని ఇది విజయ్ ప్లాన్ అని తెలుస్తుంది.ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూట్ కంటిన్యూ చేస్తాడట.
సమంతతో ఒక్క షెడ్యూల్ పూర్తి అయితే ఖుషి సినిమా అయిపోయినట్టే.ఆ తర్వాత గౌతమ్ ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.