శెట్టిపాలెం గ్రామానికి కీడు చుట్టమై వచ్చిందట...!

నల్లగొండ జిల్లా:మనిషికి ఏదైనా అర్దంకాని పరిస్థితి ఎదురైతే దానిని ఏదో అతీతశక్తిగా భావించి కొంతమంది భూతవైద్యుల మాయమాటలు నమ్మి క్షుద్ర పూజలు ( Kshudra Pooja )చేయడం, వారు చేతిలో మోసపోవడం లాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటివాటిని నమ్మేవారు, ఆచరించే వారికి సమాజంలో కొదవేలేదు.

అందులో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా ఏమీ లేదు.అందరూ గుడ్డిగా ఫాలో అవుతున్నారు.

ఇలాంటివి ఓ వ్యక్తికో,ఒక కుటుంబానికో రావడం సహజం,అప్పుడప్పుడూ గ్రామాలకు కూడా వస్తుంది.ఆసమయంలో గ్రామ పెద్దలు కొంతమంది భూత వైద్యులను లేదా కొందరు పండితులను సంప్రదించి,వారు చెప్పే మాటలు విని గ్రామం మొత్తం ఖాళీ చేసి పిల్లా జెల్లా ముసలి ముతకా ఊరికి దూరంగా వెళ్లి, అక్కడే వంటలు చేసుకొని తిని,పొద్దంతా ఉండి చీకటి పడ్డాక ఇళ్లలోకి వస్తారు.

దానితో తమ గ్రామానికి పట్టిన కీడు వదిలిపోతుందని ఓ మూఢనమ్మకం.ఇలాంటి సంఘటనే గురువారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

Advertisement

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.సుమారు 4000 మంది జనాభా ఉండే శెట్టిపాలెం గ్రామంలో గత రెండు నెలల నుంచి ఒకరు తర్వాత మరొకరు వివిధ కారణాలతో వరుసగా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకుని గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఊరికి కీడు జరిగిందనే అనుమానంతో గ్రామస్థులంతా తమ ఇండ్లకు తాళం వేసి ఓ రోజంతా పొలాల వద్ద చెట్ల కింద వంటచేసుకొని అక్కడే గడిపి కీడు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.గ్రామ పెద్దల నిర్ణయంతో గురువారం తెల్లవారు జామునే ఎక్కడిదక్కడ వదిలేసి,గ్రామం మొత్తం ఇళ్లకు తాళాలు వేసి, గ్రామం విడిచి అడవి బాట పట్టారు.

రోజంతా అక్కడే వంటవార్పు చేసుకొని, తిని చీకటి పడ్డాక తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.సాయంత్రం ఐదు గంటల తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన నిప్పు తీసుకెళ్లి ఇంట్లో వెలిగించుకొని యథావిధిగా ఉన్నారు.

ఈ విధంగా చేయడం వలన గ్రామంలో జరిగే వరుస మరణాలు తగ్గుతాయని గ్రామస్తుల నమ్మకం.ఈ తతంగాన్ని అమలు చేసేందుకు ఓ రోజు ముందునుంచే గ్రామంలో వాణిజ్య సముదాయాలు, స్కూళ్లు,గ్రామపంచాయతీ అన్ని మూసివేయాలని టాంటాం వేసి సమాచారం అందించారు.దీనితో గురువారం గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది.25 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగితే అప్పుడు కూడా ఒక్క రోజు ఊరిని విడిచి వెళ్లడం వల్ల మరణాలు తగ్గాయని చెబుతున్నారు.అందువల్ల ఇప్పుడు కూడా అలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నారు.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?
రచ్చ గెలిచి ఇంట గెలవలేదుగా.. ఎన్టీఆర్, బన్నీలకు ఒకే సమస్య ఎదురైందా?

హైటెక్ యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో ఊరిని ఖాళీ చేయడం ఏంటని విజ్ఞానవంతులు విస్తుపోతున్నారు.ఇలాంటి అర్థంలేని పనుల వల్ల నాగరిక సమాజం అనాగరికత వెళ్ళే ప్రమాదం ఉందని,ఇలాంటి గ్రామంలో అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి,ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News