జాయింట్ కలెక్టర్ ను కలిసిన భూ నిర్వాసితులు

నల్లగొండ జిల్లా:శివన్నగూడ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన శివన్నగూడ గ్రామానికి చెందిన 300 మంది భూ నిర్వాసితులు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కలిశారు.

సర్వం కోల్పోయిన తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ప్రస్తుతం తమ ప్రాంతంలో కనీసం రెండు గుంటల భూమి కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తీవ్రంగా నష్టపోయిన తమ పరిస్థితిని అర్థం చేసుకొని తక్షణం ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

The Squatters Met The Joint Collector-జాయింట్ కలెక్ట�

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ దాసరి గోపాల్, సుంకరి మల్లేష్,కాలం శేఖర్ రెడ్డి,దేప శ్రినివాస్ రెడ్డి, మైల ఎల్లయ్య,పంగ లక్ష్మయ్య,గోపిడి రవీందర్ రెడ్డి, నున్నగిపుల గిరి,బోయిని యాదయ్య,వంగాల రవీందర్ రెడ్డి,జాల వెంకటేష్,వూరిపక్క మహేందర్ మరియు నిర్వాసితులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News