చరిత్రలోనే తొలిసారిగా 83 రూపాయల దిగువకు రూపాయి విలువ

రూపాయి నేల చూపులు చూస్తోంది.గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రూపాయి విలువ నిన్న చరిత్రలోనే తొలిసారిగా 83 రూపాయల దిగువకు పడిపోయి ఆల్‌టైం కనిష్ఠానికి చేరుకుంది.82.30 వద్ద నిన్న ట్రేడింగ్ ప్రారంభం కాగా, ఆ తర్వాత ఒక దశలో 82.95 రూపాయలకు పడిపోయింది.మంగళవారం నాటి క్లోజింగ్‌తో పోలిస్తే నిన్న ఒక్క రోజే 61 పైసలు క్షీణించి 83.02 దిగువకు పడిపోయింది.83 కిందికి పడిపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి.బుధవారం సెషన్ ఆరంభంలో రూపాయి సానుకూలంగానే ట్రేడ్ అయింది.అయితే, ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది.ఇది మరింత పతనమై 83.50 దిగువకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు, రిజర్వు బ్యాంకు డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు.రూపాయి పతనం కొనసాగుతుండడంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీరేట్లను పెంచడంపై భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 The Rupee Fell Below 83 Rupees Yesterday For The First Time In Its History.-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube