ఎంపీ ఎన్నికల్లో( MP Elections ) పోటీకి ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డురాదని కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి( Mallu Ravi ) అన్నారు.రెండు పదవులు ఏకకాలంలో చేయొచ్చని తెలిపారు.
నాగర్ కర్నూల్ ఎంపీగా( Nagar Kurnool MP ) పోటీలో ఉంటాననుకుంటున్నానని మల్లు రవి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే తాను గతంలో రెండుసార్లు ఎంపీగా పని చేశానని చెప్పారు.ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) ఖచ్చితంగా పోటీ చేస్తానని మల్లు రవి స్పష్టం చేశారు.