ప్రైవేట్ పాఠశాలను మూసేస్తామంటున్న యాజమాన్యం

నల్లగొండ జిల్లా:జిల్లాలో విద్యా,వైద్యం ప్రజలందరికీ అందాలనే ఆకాంక్షతో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కంకణబద్దుడై తనఖీలు నిర్వహిస్తున్నారు.

కానీ,నల్లగొండ విద్యానగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ని మూసే వేస్తున్నామని యాజమాన్యం చెప్పడంతో విద్యార్దులు ఇబ్బంది పడతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం పాఠశాల వద్దకు చేరుకుని,విద్యార్థి సంఘ నాయకులతో కలిసి స్కూల్ ఆవరణలో పాఠశాలను మూసివేయవద్దని ధర్నా నిర్వహించారు.విద్యా సంవత్సరం మధ్యలో మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని,పాఠశాల మూసివేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం తల్లిదండ్రులు నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ సీఐ పాఠశాల యజమాన్యంతో మాట్లాడి తల్లిదండ్రులకు పాఠశాల యొక్క వివరాలను వెల్లడించాలని,లేనిపక్షంలో మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పాఠశాలలో విద్యార్థులు 147 మంది మాత్రమే ఉన్నారని, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ విద్యా సంవత్సరం వరకు పాఠశాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.అయితే పాఠశాల మూసివేతలో భాగంగానే సిబ్బందికి గత ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు సైతం ఇవ్వడంలేదని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని పాఠశాల చైర్మన్,డైరెక్టర్లను అడిగేందుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.ఇదే విషయమై నల్లగొండ ఎంఈఓ అరుంధతి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు స్కూల్ ను సందర్శించి మాట్లాడుతూ.

Advertisement

విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నందు కూడా ఫిర్యాదు చేశారు.ఈ స్కూల్ పై విచారణ చేసి ఉన్నతస్థాయి విద్యాశాఖ అధికారులకు నివేదిక అందజేసి,శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మూసి ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలని సిపిఎం పాదయాత్ర
Advertisement

Latest Nalgonda News