కుక్క‌కు నేర్పిన విద్య చివ‌ర‌కు అత‌ని తిక్క కుదిర్చిందిగా!

మనలో చాలా మంది మూగజీవాల పట్ల ప్రేమను కురిపిస్తుంటారు.ఇంత వరకు బాగానే ఉన్న మూగజీవాలతో కలిసి కొంత మంది చేసే చేష్టలు, వాటికి నేర్పించే పనులు విచిత్రంగా ఉంటాయి.

 The Education Taught To The Dog Seemed To Crush Him To The End, Dog, Man Fell Do-TeluguStop.com

ఇలా తమ యజమానులు నేర్పిన పనులను వారికే ఎలా ఉంటాయో రుచి చూపిస్తుంటాయి మూగజీవాలు.ఇందులో వాటి తప్పు లేకపోయినా ఒక్కో సారి మాత్రం యజమానుల ఆగ్రహానికి బలైపోతుంటాయి.

కొంత మంది మూగజీవాలపై కురిపించే అతి ప్రేమను తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.ప్రపంచంలో కేవలం వారు మాత్రమే మూగజీవాలను ప్రేమిస్తున్నట్లు కటింగ్ ఇస్తుంటారు.

వాటితో అతి చేసుకుంటూ… ఇబ్బందుల పాలవుతారు.ఇలా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా… కింద పడిపోయిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే…

అమెరికాలోని మైనెలో నివాసం ఉండే డెక్లాన్ అనే వ్యక్తికి ఓ పెంపుడు కుక్క ఉంది.ఓ సారి పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన డెక్లాన్ ప్రమాదానికి గురయ్యాడు.

కారులో నుండి దిగుతూ… డెక్లాన్ స్టైల్ గా తన కుక్కను పట్టుకోమ్మని ఓ కర్రను విసిరాడు.కుక్క ఆ కర్రను అందుకునేందుకు పరుగెత్తు కుంటూ వస్తుంది.

అదే సమయంలో డెక్లాన్ కారు డోరు తీసుకుని కిందకి దిగుతాడు.

ఇలా కట్టెను నోటితో పట్టుకుందామని వస్తున్న కుక్క డెక్లాన్ కాళ్లకు అడ్డం తగలడంతో అతడు కింద పడ్డాడు.దీంతో డెక్లాన్ తలకు తీవ్ర గాయమైంది.అనంతరం కుక్క కట్టెను పట్టుకొని వచ్చి… మరలా వేయమంటూ చూస్తూ నిల్చుంటుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు డెక్లాన్ కు చురకలంటిస్తున్నారు.

అసలు ఇలాంటి రిస్కుతో కూడుకున్న పనులు చేయడం ఎందుకు అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube