నత్తనడకన సాగుతున్న గండి పూడ్చివేత పనులు

నల్గొండ జిల్లా:ఎన్.ఎస్.

పి అధికారుల అలసత్వంమో!విధి ఆడిన వింత నాటకమో! కానీ,నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పడిన గండి నిడమనూరు మండల రైతుల పాలిట శాపంగా పరిణమించింది.

ఎడమ కాలువకు గండి పడడం వలన పంట మొత్తం నష్టపోవడంతో రైతులకు తీవ్ర నిరాశే మిగిల్చింది.నాగార్జునసాగర్ ఎడమకాల్వకు 32.1 కిలోమీటర్ వద్ద గత బుధవారం సాయంత్రం గండిపడిన విషయం తెలిసిందే.కాల్వకట్ట సుమారు 10-15 మీటర్ల మేర కోతకు గురై తెగిపోవడంతో వేల ఎకరాలల్లో పంట కొట్టుకుపోయి కోట్లలల్లో నష్టం వాటిల్లింది.

The Digging Works Are Going On At A Snail's Pace-నత్తనడకన �

ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎడమకాలువలో దాదాపు 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కావడంతో కాల్వకట్ట పటిష్టంగా లేకపోవడం వల్లనే నిడమనూరు మండలం వేంపాడు సమీపంలోని (యూటి) అండర్ టన్నెల్ వద్ద కాల్వకు గండి పడిందని తెలుస్తోంది.కాలువలోని నీటి ఉధృతికి సాయంత్రం చిన్న బుంగపడి కొన్ని నిమిషాల్లోనే కాల్వకట్ట కోత గురై 10 మీటర్ల మేరకు ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది.

అదేవిధంగా ఎడమ కాలువకు పడిన గండిని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,ఎన్ఎస్పి ఎస్సీ ధర్మనాయక్ వారం రోజుల్లో ఫూర్తి చేస్తామన్నారు.కానీ,నేటికీ తొమ్మిది రోజులు అవుతున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు రైతులకు మరింత శాపంగా మారింది.

Advertisement

గండి పూడ్చివేత పనులు ప్రారంభించి ఏడు రోజులు కావస్తున్నా పనులు పూర్తి స్థాయికి చేరుకోలేదు.గండి పడిన ప్రదేశంలోని అడుగుభాగంలో నల్లమట్టిని పోసి రోలరింగ్ సహాయంతో గండి పూడ్చివేత పనులు సాగుతున్నాయి.

నేటికి కనీసం 30 శాతం మాత్రమే గండిని పూడ్చివేత పనులు పూర్తయ్యాయి.కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును చూసి రైతులు స్థానిక ఆధికారులను నిలిదీశారు.ఇలాగే నత్తనడకన గండిపూడ్చివేత పనులు సాగితే నష్టపోయిన పంటలతో పాటు,ఉన్న పంటలకు నీరు అందక నష్ట తీవ్రత పెరిగే అవకాశం మరింత ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం నాటికి గండిపడి ఎనిమిది రోజులు గడిచింది.మరమ్మతు పనులు మరో వారం రోజులు పట్టినా ఆశ్చర్యం పోనవసరం లేదు.

ఇప్పటికే వరి పంట సేద్యం చేసిన భూములు నీటి సరఫరా లేకపోవడంతో నేలలు ఆరిపోయి నెర్రెలు బారాయి.అధికారులు మాత్రం మరో ఐదు రోజుల్లో గండిపూడ్చే పనులు పూర్తి చేస్తామంటున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కానీ,నీటి ఆదరణ లేకుండా ఎడమకాల్వ నీటి ఆదరణతో ఖరీఫ్ లో సాగు చేసిన వరి పంటలు పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు.గండి పూడ్చివేత పనులు సుమారు మరో 10 నుండి 15 రోజులు వరకు పట్టే అవకాశం ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు.

Advertisement

గండి పూడ్చివేత పనులు ఇలాగే కొనసాగితే రైతులు ఖరీఫ్ సీజన్ లో సేద్యం చేసిన వరి,ఇతర పంటలు పూర్తిగా నష్టపోక తప్పదని స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు.ఎడమ కాలువ గండిని పూడ్చేంత వరకు సాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతులకు మాత్రమే వ్యవసాయ మోటార్లకు 24గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రస్తుతం వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ 12గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.ఇలా కాకుండా గతంలో లాగానే వ్యవసాయ మోటార్లకు కూడా 24గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తే రైతులు వేసిన పంటలు నష్టపోకుండా ఉంటారని పలువురు చెబుతున్నారు.

అదేవిధంగా నత్తనడకన నడిచే గండి పూడ్చివేత పనులను యుద్దప్రాతిపధికన పూర్తి చేసి రైతులు తీవ్రంగా నష్టపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.ఇదిలా ఉంటే గండి పడిన ప్రాంతం ప్రక్కనే యూటి లీకేజీ అయి గండిపూడ్చే ప్రాంతంలో గండి పూడ్చే పనులకు అండ్డంకిగా మారింది.

ఈ లీకేజీ నీటిని మోటార్ సహాయం నీటిని బయటకు తీడేస్తున్నారు.నాగార్జునసాగర్ ఎడమకాల్వకు 32.1 కిలోమీటర్ వద్ద పడిన గండిపనులు నత్తనడకన సాగడంతో పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.కొందరు రైతులు గండి పూడ్చివేత పనులు యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని శుక్రవారం ఉదయం ధర్నా చేపట్టారు.

వీరికి కాంగ్రేస్,సీపీఎం,సీఐటీయూ నేతలు మద్దతు ప్రకటించారు.విషయం తెలుసుకున్న పోలీసులు రైతులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక చోరువతో గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Latest Nalgonda News