దైవ దర్శణం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా హుండీల్లో కానుకలు వేయడం చాలా కామన్‌గా చూసే విషయం.కొన్ని దేవాలయాల్లో హుండీలు ఉండవు.
ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఫేమస్ అయిన చిల్కూరు బాలాజీ టెంపుల్‌లో హుండీలు ఉండవు.అక్కడ దేవుడిని దర్శించుకున్న వారు కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు.
కాని కొన్ని దేవాలయ్యాల్లో అడుగడుగున హుండీలు ఉంటాయి.గుడిలోకి ఎంటర్ అయినప్పటి నుండి గర్బగుడి వరకు ప్రతి చోట కూడా హుండీ ఉంటుంది.
కానుకలు ఇందులో వేయండి అంటూ వాటిపై ఉంటుంది.
గుడిలోకి వెళ్లిన భక్తులు తమకు తోచినంత కానుకలు వేయవచ్చు, వేయక పోవచ్చు వారి ఇష్టం.దేవుడు కానుకలు వేస్తేనే కోరిక తీర్చుతాడు అనేది ఏమీ లేదు.ఒకప్పుడు దేవాలయాల్లో హుండీలే ఉండేవి కావు.
దేవాలయాలకు వచ్చిన పేద వారికి రాజులు మరియు అయ్యవార్లు దేవుడి మాన్యంగా వచ్చిన ధనం మరియు ధాన్యంను ఇచ్చే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.రాజకీయనాయకులు దేవాలయాలను కమర్షియల్ చేశారు.దైవం పేరు చెప్పి కొందరు దోపిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరు ఇలాంటి వారి వల్లే హిందూ మతం నుండి ఇతర మతాలకు మారుతున్నారు.
హిందూ ధర్మంలో ఎక్కడ కూడా దేవాలయాలకు వెళ్లిన వారు కానుకలు సమర్పించాలని లేదు.అయితే తమకు ఆసక్తి ఉంటే దేవాలయం అభివృద్దికి, దేవుడి పేరుతో ఇతరులకు సేవ చేస్తున్న వారికి సాయంగా ఎంత తోచిన వారికి అంత ఇస్తే మంచిదే.హుండీలో వేసిన డబ్బు ఇతరుల సాయంకు వినియోగించబడితే అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మరింత మంచి చేస్తుంది.
అంతే తప్ప కానుకలు వేస్తేనే కోరికలు తీరుతాయి, అంతా బాగుంటుంది అనేది మాత్రం ఏమీ లేదని పండితులు చెబుతున్నారు.
దేవాలయాల్లో బలవంతంగా కానుకలు వసూళ్లు చేయడం జరగదు, కాని దేవాలయంకు వెళ్లిన ప్రతి వారు తోచినంత హుండీలో వేయాలనే ప్రచారం బాగా జరుగుతుంది.
అందుకే ప్రతి ఒక్కరు కూడా తమకు తోచినంత వేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.చిల్కూరు దేవాలయంను ఆదర్శంగా తీసుకుని ఇతర ఆలయాలు కూడా హుండీలను తీసివేయాలని కొందరి అభిప్రాయం.
అయితే హుండీలు ఉన్నా వాటి ద్వారా వచ్చే ఆదాయం మంచి పనులకు వినియోగిస్తే సమస్య లేదని కొందరు అంటున్నారు.
మీ ఆర్ధిక పరిస్థితిని బట్టి మీరు హుండీలో కానుకలు వేయవచ్చు.
తక్కువ వేశారు అని దేవుడు చిన్న చూపు చూడటం ఏమీ ఉండదని హిందూ మత ప్రచారకులు అంటున్నారు.