ఈ మధ్య కాలంలో యువత అనగానే ముందుగానే వారు వేసుకొనే డ్రస్సింగ్ గుర్తుకు వస్తుంది.అదే జీన్స్,టీ-షర్ట్, గుబురు గడ్డం ఇలా ఎవరిని చూసినా అదే ఫాలో అవుతున్నారు.
కారణం ట్రెండ్ అంటారు.సినిమాల్లో ఏ హీరో ఏ స్టైల్ ఫాలో అయితే యూత్ కూడా అదే ఫాలో అవ్వడం ఇదే పరిపాటిగా మారిపోయింది.
అయితే ఐటీ కంపెనీ లలో కూడా వీటిపై పెద్దగా ఆంక్షలు విధించక పోవడం తో ఇప్పుడు ఉద్యోగాలు చేసే వారైనా ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు.కానీ మీసం ట్రిమ్ చెయ్యాలి,క్లీన్ గా కనిపించే ఐరన్ చేసిన బట్టలు ధరించాలి,గడ్డం అనేది ఉండకూడదు(మతపరమైన అంశాల్లో తప్ప) ….
ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు పాటించాల్సిన విషయాలు అన్నమాట.బ్యాంక్ ఆఫ్ బరోడా లో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఈ విధానాలను పాటించాల్సిందేనట.
ఆ మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజ్ మెంట్ గుజరాత్ లోని కొన్ని బ్రాంచ్ లలో రహస్య తనిఖీలు నిర్వహించింది.అయితే ఆ తనిఖీలలో వారికి స్పష్టంగా అర్ధం అయిన విషయం ఏమిటంటే.
ప్రతి ఉద్యోగి కూడా ఇష్టారాజ్యంగా బ్యాంకు కు వస్తున్నాడు.చింపిరి జుట్టు,పొడవాటి మీసాలు,గుబురు గడ్డం,టీ-షర్టు లు ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు బట్ట విషయంలోగాని, కాలికి ధరించే పాదరక్షలలో ఎలాంటి నియమ నిబంధలు పాటించడం లేదు అని తెలిసింది.
ఉద్యోగులు ఇలా కనిపిస్తే, ఇక బ్రాంచిల కు కస్టమర్లు ఎలా వస్తారు అన్న ఉద్దేశ్యంతో మేనేజ్మెంట్ పై కండీషన్స్ అప్లై అంటూ సర్క్యులర్ జారీ చేసింది.ఇకపై భుజ్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా పురుష ఉద్యోగులు ఎక్కువ జుట్టు పెంచుకోకూడదు, మీసాలు ట్రిమ్మింగ్ చేయించుకోవాలి.క్లీన్‌గా కనిపించే, ఐరన్ చేయించిన డ్రెస్సులు మాత్రమే వేసుకుంటూ స్మార్ట్ లుక్‌లో కనిపించాలి అంటూ అక్కడి మేనేజ్ మెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఇక మహిళా ఉద్యోగులు కూడా చీరలు, సల్వార్ సూట్స్ వేసుకోవాలని బ్యాంక్ సూచించింది.
అయితే ప్రస్తుతం గుజరాత్ లోనే ఈ విధానం త్వరలో దేశవ్యాప్తంగా ఆ బ్యాంకు ఉన్న అన్ని బ్రాంచుల్లో కూడా అమలు చేసే అవకాశాలున్నాయి.బ్యాంక్ ఆఫ్ బరోడా ఈమధ్యే విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌తో విలీనమైన సంగతి తెలిసిందే.