అటుకులు.వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
వడ్లు నుంచి వచ్చే అటుకుల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా మన భారతీయులు అటుకులతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తుంటారు.
అటుకుల ఉప్మా, అటుకుల పాయసం, మిరియాల అటుకులు, కొత్తిమీర అటుకులు, అటుకుల పులిహోర.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి.
ఇక అటుకులతో ఏ వంట చేసుకున్నా.అద్భుతంగా ఉంటాయి.వంటల విషయం పక్కన పెడితే.అటుకులు ఆరోగ్యానికి చేసే మేలేంటీ అంటే.
బోలెడన్ని ఉన్నాయనే చెప్పాలి.అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
రక్తహీనత సమస్య ఉన్న వారికి అటుకులు బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే, అటుకుల్లో పుష్కలంగా ఉండే ఐరన్.
రక్తహీనత సమస్యను సులువుగా నివారిస్తుంది.
అటుకుల్లో విటమిన్ ఏ, బి, సి, కె, కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.నిరాసంగా ఉన్నవారు అటుకులను పాలలో నానబెట్టి తీసుకుంటే.తక్షణ శక్తి లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు అటుకులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.ఎందుకంటే.
అటుకుల్లో గ్లూకోజ్ గాని, కొవ్వు పదార్దాలు కాని అస్సలు ఉండవు.పైగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవ్వడంతో.
జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
అలాగే అటుకుల్లో ఉన్న యాంటీ ఆక్సీడెంట్స్ ఎన్నో భయంకర వైరస్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
మధుమేహంతో బాధపడుతున్నవారు అటుకులు తీసుకుంటే.షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే అటుకులు.పిల్లలకు, పెద్దలకు, గర్భిణీలకు బలవర్ధకమైన ఆహారం.
సో.అటుకులను తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకోండి.