తెలంగాణకు మరో ఐదురోజులు వర్ష ముప్పు

నల్లగొండ జిల్లా:గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల 5వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని,ఈ క్రమంలో మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.దీనితో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌,మంచిర్యాల, నిర్మల్‌,నిజామాబాద్, జగిత్యాల,సిరిసిల్ల,పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి,ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,భువనగిరి, మహబూబాబాద్‌,వరంగల్,హన్మకొండ,జనగామ,సిద్దిపేట జిల్లాలకు ప్రభుత్వం ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Telangana Is Threatened With Rain For Another Five Days, Telangana ,rain , Heavy

Latest Nalgonda News