కొందరి చేతిలో తెలంగాణ బందీ అయింది..: రేవంత్ రెడ్డి

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ విజయభేరీ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రమాదంలో పడిందని తెలిపారు.

 Telangana Has Become Captive In The Hands Of Some..: Revanth Reddy-TeluguStop.com

కొందరి చేతిలో రాష్ట్రం బందీ అయిందన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చేందుకు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.

తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్ కు సాగునీరు వచ్చేదన్నారు.అయితే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు కడితే కమీషన్లు రావని కేసీఆర్ భావించారన్నారు.

రీడిజైన్ ల పేరుతో ప్రాజెక్టుల వ్యయం పెంచి అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలనలో 25 లక్షల మందికి ఇందిరిమ్మ ఇళ్లు వచ్చాయన్నారు.

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు.కాంగ్రెస్ గెలిస్తే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని హమీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube