సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా విడుదలకు వారం లేదా నాలుగైదు రోజుల ముందు మాత్రమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయిస్తారు.సెన్సార్ కార్యక్రమాలు అంత ముందు పూర్తి చేసి ఒక పోవడానికి కూడా కారణాలు ఉంటాయి.
సినిమా విడుదల చాలా రోజులు ఉండగానే సెన్సార్ టాక్ బయటకు వస్తే సినిమా కు డ్యామేజ్ జరుగుతుంది అనేది చాలా మంది అభిప్రాయం.అందుకే సినిమా రెడీ అయినా కూడా సెన్సార్ కార్యక్రమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
సెన్సార్ కార్యక్రమాలను జరపడం కోసం సినిమా విడుదల తేదీ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే సెన్సార్ జరిపిస్తారు.కానీ తమిళ సూపర్ స్టార్ విజయ్ బీస్ట్ సినిమా కు మాత్రం నెల రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయడం చర్చనీయాంశం గా మారింది.
వచ్చే నెల 13వ తారీఖున విడుదల కాబోతున్న బీస్ట్ సినిమా కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ను సెన్సార్ చేసిన సభ్యులు సినిమా ని ప్రశంసించారని సమాచారం అందుతోంది.
విజయ్ ఈ సారి అంతకు మించి అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాడనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారట.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఈ నెల చివరి నుండి లేదా వచ్చే నెల మొదటి వారంలో షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కనుక విజయ్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా యొక్క తెలుగు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం అందుతోంది.విజయ్ ఇప్పటి వరకు తెలుగు లో పెద్దగా సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు.
కనుక బీస్ట్ సినిమా ఆయనకు సక్సెస్ ను అందిస్తుందా అనేది చూడాలి.అయితే ఈ సినిమా కు పోటీ అన్నట్లుగా కేజీఎఫ్ 2 విడుదల కాబోతోంది.
కనుక విజయ్ బీస్ట్ సినిమా కి ఎలా ఉంటుంది అనేది చూడాలి.