చిలకడ దుంప సాగులో ఎరువుల యజమాన్యం.. అనువైన నేలలు, మేలురకం విత్తనాలు..!

చిలకడదుంప సాగులో( Sweet Potato Cultivation ) మేలు రకం విత్తనాలు, అనువైన నేలలు, అనువైన కాలాలతో పాటు తెగుళ్ల నివారణకు సంబంధించి సంరక్షణ పద్ధతులు తెలుసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చు.చిలకడ పంట సాగులో ముఖ్యంగా అనువైన నేలల విషయానికి వస్తే ఇసుక, వండ్రు, గరప నేలలు చాలా అనుకూలమని చెప్పవచ్చు.

 Sweet Potato Cultivation Process And Techniques Details, Sweet Potato, Sweet Pot-TeluguStop.com

బంకమట్టి నేలలు, తేమ శాతం అధికంగా ఉండే నేలలు ఈ పంటకు అనుకూలం కాదు.ఎందుకంటే ఈ నేలలలో దుంపలు వృద్ధి చెందలేదు.

ఇంకా వర్షాలు ఎక్కువగా పడినా, నీడ ఎక్కువగా ఉన్న దుంపలు కుళ్లిపోతాయి.

కాబట్టి వర్షాలు తక్కువగా కురిసే సమయాలలో, నీరు నిల్వ ఉండని పొలాలలో ఈ చిలకడదుంప సాగు బాగుంటుంది.

ఇక శ్రీ నందిని, శ్రీ వర్ధిని, వర్ష, శ్రీ రత్న, శ్రీ భద్ర లాంటి మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.విత్తనాలు ( Seeds ) నాటిన తర్వాత తీగలు 20 సెంటీమీటర్ల పొడవు పెరిగాక, ఆ తీగలను 2-4 కణుపుల, 4-5 ఆకులు ఉండేటట్టు కత్తిరించి పొలంలో ఏటవాలుగా సుమారు ఐదు సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి.

వీటిని నాటే తప్పుడు భూమిలో తేమ( Moisture ) ఉండాలి.నాటిన తర్వాత వెంటనే ఒకసారి మీరు అందించాలి.ఇక వాతావరణం చాలా పొడిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నీరు అందించాలి.ఇలా దాదాపు పంట వేసిన 80 రోజుల వరకు నీటి కొరత లేకుండా జాగ్రత్త పడాలి.

తరువాత ఎరువుల విషయానికి వస్తే దాదాపుగా 5 టన్నుల పశువుల ఎరువులో 25 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.పంట వేసిన 60 రోజులకు తగిన మోతాదులో నత్రజనిని పంటకు అందించాలి.అవసరం అయితే నత్రజనిని మళ్లీ తగిన మోతాదులో పంట వేసిన 80 రోజులకు అందిస్తే దుంపలు సమృద్ధిగా పెరుగుతాయి.ఇలా సరియైన జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube