ప్రస్తుతం కేంద్రంలో 2014 నుంచి బీజేపీ సర్కార్( BJP Govt ) అధికారంలో ఉంది.మోడీ ( Modi )మేనియాతో 2019 ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించిన కమలం పార్టీ 2024 ఎన్నికల్లో కూడా సత్తా చాటలని ఉవ్విళ్లూరుతోంది.
కాగా ఈసారి ఎలాగైనా మోడీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని విపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.అందుకోసం అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాల మద్య ఐక్యత లేకపోతే మోడీని ఓడించడం కష్టమనే చెప్పాలి.దాంతో దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ఏకమై మోడీని గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి.
అయితే విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం సాధ్యమేనా అంటే చెప్పలేని పరిస్థితి.కాంగ్రెస్ ( Congress )ఇప్పటికే విపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉంది.

అయితే హస్తం పార్టీతో కలిసి నడిచే పార్టీలేవీ అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.మరోవైపు బిఆర్‌ఎస్( BRS ) తో దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసిఆర్ కూడా విపక్షలను ఏకం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.అయితే బిఆర్‌ఎస్ కాంగ్రెస్ తో కలుస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.ఇక తాజాగా కాంగ్రెస్ ప్రమేయం లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ వంటి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ మద్య విపక్షాల ఐక్యతకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు అయ్యారు.దీంతో దీన్ని బట్టి చూస్తే ఆమె కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేదనే విషయం స్పష్టమౌతోంది.
ఇదిలా ఉంచితే అఖిలేశ్ యాదవ్ ఆ మద్య శరత్ పవార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సిఎం పినరై విజయన్, కేసిఆర్ వంటి వాళ్ళతో భేటీ అయ్యారు.ఇప్పుడు మమతా బెనర్జీతో కూడా ఆయన భేటీ కావడంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయా ? అనే సందేహం రాక మానదు.

అయితే అయితే ఈ ముఖ్య నేతల భేటీలో ఎక్కడ కాంగ్రెస్ ప్రస్తావన లేకపోవడంతో కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారా అనే డౌట్ కూడా వస్తోంది.అయితే దేశంలో అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను కాదని మోడీని ఓడించడం విపక్షాలకు సాధ్యమేనా ? అంటే.అది అంతా తేలిక కాదనే చెప్పాలి.కాంగ్రెస్ మరోవైపు కాంగ్రెస్ కూడా తృతీయ ఫ్రంట్ ఏర్పాట్లలో బిజీగానే ఉంది.కాంగ్రెస్ కు మద్దతు తెలిపే పార్టీలు ఒకవైపు.తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాది పార్టీ, బిఆర్‌ఎస్ వంటి ఇతరత్రా పార్టీలు మరోవైపు ఉండేలా కనిపిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తే మోడీని గద్దె దించేందుకు రెండు ఫెడరల్ ఫ్రాంట్స్ ఏర్పడిన ఆశ్చర్యం లేదనీది మరికొందరి వాదన.అయితే రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం కాబట్టి.
ఎన్నికల సమయానికి అన్నీ పార్టీలు కలిసిన ఆశ్చర్యం లేదనేది మరికొందరి వాదన.ఏది ఏమైనప్పటికి మోడీని గద్దె దించడానికి విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయనే చెప్పాలి.







