టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్.కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకొని అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు.
అయితే వరుస ఫెయిల్యూర్ సినిమాలతో మరల రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ హీరోల సినిమాలలో చేస్తున్నాడు.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత అతని కామెడీ టైమింగ్ లో ఏ దర్శకుడు ఇప్పటి వరకు సాలిడ్ గా ఉపయోగించుకోలేదు.
నటుడుగా ఏదో చేస్తున్నాడు తప్ప గుర్తుండిపోయే పాత్రలు మాత్రం కాదు.అయితే ఈ మధ్య రవితేజ డిస్కో రాజా సినిమాలో ఊహించని విధంగా క్లైమాక్స్ లో విలన్ గా కనిపించి సందడి చేశాడు.
దీంతో అతనిలో విలనిజం కూడా ఉందని గ్రహించిన కలర్ ఫోటో టీం అతనిని పూర్తి స్థాయి విలన్ గా తెరపై ఆవిష్కరించింది.కేవలం బాడీ లాంగ్వేజ్, హావభావాలతోనే విలనిజం ప్రదర్శించే పాత్రలో కలర్ ఫోటో సినిమాలో సునీల్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.
ఆహాలో రిలీజ్ అయిన సినిమాకి హిట్ టాక్ వచ్చింది.ఈ నేపధ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో సునీల్ మాట్లాడాడు.
ఈ చిత్రంలో అందరూ యంగ్ స్టర్స్ నటించారని, వారితో కలిసి పని చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.అందరూ తనను ఎంతో బాగా చూసుకున్నారని అన్నారు.
వాళ్లు చెప్పినట్టే తాను నటించానని తెలిపారు.సినిమా చూసిన వారంతా కొట్టకుండా, తిట్టకుండా భలే భయపెట్టావ్ భయ్యా అని ఫోన్ చేసి చెపుతుంటే సినిమాతో పాటు, తన పాత్ర హిట్ అయిందని తనకు అర్థమయిందని చెప్పారు.
విలన్ అవుదామనే తాను ఇండస్ట్రీకీ వచ్చానని, ఈ సినిమాతో తన కోరిక తీరిందని సునీల్ అన్నారు.సినిమాలో అందరూ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
సందీప్ రాజ్ కొత్త దర్శకుడు అయినప్పటికీ గొప్పగా తెరకెక్కించాడని కితాబిచ్చారు.