18 రోజుకు చేరుకున్న విఓఏల నిరవధిక సమ్మె...!

నల్లగొండ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఐకెపిలోపని చేస్తున్న వివోఏ నాంపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారానికి 18వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా ప్రజానాట్యంమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి వారిని మద్దతు తెలిపి మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడి విఓఏ లను చర్చలకు పిలిచి,వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

విఓఏలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ఆన్లైన్ సేవలను రద్దు చేయాలని,అరులైన వాళ్లకు సీసీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, సెర్ఫ్ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే సైదా బేగం,ఎస్.

కె పరహణ,చంద్రకళ, మమత,సుజాత,జ్యోతి, పుష్పలత,యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్ ఫ్యామిలీపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అమెరికన్ మహిళ.. వీడియో వైరల్..
Advertisement

Latest Nalgonda News